స్వాతంత్య్ర దినోత్సవం నాడు విషాదం: నుజ్జునుజ్జయిన కారు, 6గురు యువకులు మృతి
దేశంలోని ప్రజలందరూ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ఒక హృదయవిదారకమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిర్చారి నేషనల్ హైవే కూడలి వద్ద అతివేగంగా వచ్చిన ఒక కారు ట్రక్కును ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది.
ప్రమాదానికి కారణం ఇదే..
ఈ ఘోర ప్రమాదం బాగ్‌నదీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ఈ కారులో మొత్తం ఏడుగురు యువకులు ఉన్నారు. వారు నాగ్‌పూర్ నుంచి రాజ్‌నంద్‌గావ్ వైపు వెళ్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాలుగు వరుసల జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారులోని డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది.

ఘటనా స్థలంలో సహాయక చర్యలు.. పోలీసుల దర్యాప్తు
ఈ ఢీకొనడం ఎంత భయంకరంగా ఉందంటే.. కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు. కారు నడుపుతున్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలవ్వడంతో అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన యువకుల కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications