PM Modi Video: GenZ స్టైల్‌లో ప్రధాని మోదీ! గెట్ రెడీ విత్ మీ అంటూ..

సాధారణంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే పిలుపులు, చేసే ప్రసంగాలు చాలా గంభీరంగా ఉంటాయి. కానీ ఈసారి ఆయన తీసుకున్న రూట్ పూర్తిగా వేరు. యువతకు, ముఖ్యంగా 'జెన్‌జీ'కి బాగా దగ్గరయ్యేలా రాత్రి వేళల్లో తన సోషల్ మీడియా ఖాతాల్లో వీడియోలను షేర్ చేస్తున్నారు. తాజాగా గురువారం రాత్రి కూడా ఓ సరికొత్త వీడియోను పంచుకుని నెటిజన్లను ఆశ్చర్యపరిచారు.

క్యాజువల్‌గా నడుచుకుంటూ వచ్చి కెమెరా ముందుకు నిలబడిన ప్రధాని, నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా తన శైలిని పూర్తిగా మార్చేశారు. ఈ నెల 7న జరగనున్న 'జాతీయ చేనేత దినోత్సవం' సందర్భంగా భారతీయులంతా స్వదేశీ చేనేత ఉత్పత్తులను ఆదరించాలని సరికొత్త బాటలో పిలుపునిచ్చారు.

Trendy Promotion PM Modi Takes Get Ready With Me Route to Boost Indian Handlooms and Local Artisans

'గెట్ రెడీ విత్ మీ'.. మోదీ వాడిన కొత్త పదం!

ఈ వీడియోలో మోదీ వాడిన భాష, చేసిన విజ్ఞప్తి అంతటా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా ట్రెండ్ అయ్యే 'గెట్ రెడీ విత్ మీ' (GRWM) స్టైల్‌లో నేరుగా కెమెరాతో మాట్లాడిన ప్రధాని.. తన ముందున్న టేబుల్‌పై రకరకాల చేనేత కండువాలను ఉంచారు.

అందులోంచి ఒక కాషాయ రంగు చేనేత కండువాను ఎంచుకుని ఎంతో ముచ్చటగా భుజంపై వేసుకుని అలరించారు. "ఫ్రెండ్‌షిప్ డే రోజు మీ స్నేహితులకు బ్యాండ్లు కట్టి ఏ స్థాయిలో పండగ చేసుకున్నారో, అదే ఉత్సాహంతో మన చేనేత దినోత్సవాన్ని కూడా జరుపుకోండి. మీరు ఇష్టపడే చేనేత దుస్తులతో వీడియోలు చేసి, #NationalHandloomDay హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి" అని కోరారు.

మోదీకి నెతన్యాహు సీక్రెట్ కాల్.. అగ్రనేతల మైండ్ గేమ్..
మోదీకి నెతన్యాహు సీక్రెట్ కాల్.. అగ్రనేతల మైండ్ గేమ్..

ఒక్క చేనేత వస్త్రం.. లక్షలాది కుటుంబాలకు ఆసరా!

చేనేత అనేది కేవలం ఒక ఫ్యాషన్ మాత్రమే కాదని, అది తరతరాల భారతీయ సంస్కృతికి, నేతన్నల చెమట చుక్కలకు ప్రతీక అని ప్రధాని కొనియాడారు. మన దేశంలో ఉన్న వైవిధ్యభరితమైన చేనేత రంగ ప్రాముఖ్యతను చాటిచెప్పడానికి ప్రతి ఒక్కరూ 'వోకల్ ఫర్ లోకల్' మంత్రాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరు కొనుగోలు చేసే చిన్న చేనేత వస్తువు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లక్షలాది మంది చేనేత కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని, వారి ఆర్థిక ప్రగతికి ఊతాన్నిస్తుందని ఆకాంక్షించారు.

PM Modi: ఐదేళ్లలో 550 కోట్లు.. మోదీ విదేశీ టూర్ల ఖర్చు బయటపెట్టిన కేంద్రం
PM Modi: ఐదేళ్లలో 550 కోట్లు.. మోదీ విదేశీ టూర్ల ఖర్చు బయటపెట్టిన కేంద్రం

స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో.. నేరుగా యువత మనసుల్లోకి!

1905లో ప్రారంభమైన చారిత్రాత్మక స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే, మూసధోరణి ప్రకటనల కంటే నేరుగా ప్రజలతో, ముఖ్యంగా సోషల్ మీడియాలో నిత్యం గడిపే యువతతో కనెక్ట్ అయ్యేందుకు ప్రధాని మోదీ ఎంచుకున్న ఈ 'షార్ట్ వీడియో' కాన్సెప్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఇటీవల కాలంలో ఆయన చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోల్లోకెల్లా ఇది అత్యంత ఆసక్తికరంగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+