వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ కోర్టులో చిదంబరానికి లభించని ఊరట.. మరోరోజు సీబీఐ కస్టడీకి ...

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక కోర్టులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రికి ఊరట లభించలేదు. ఆయన కస్టడీ మరో రోజు పొడిగించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇవాళ్టితో కస్టడీ ముగియనుండటంతో .. విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇప్పటికే 11 రోజులు విచారించినందున .. బెయిల్ ఇవ్వాలని చిదంబరం తరఫు న్యాయవాదులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక జడ్జీ అజయ్ కుమార్ మరోరోజు కస్టడీకి ఇస్తున్నట్టు ప్రకటించారు.

చిదంబరం సీబీఐ కస్టడీని పొడిగించిన సుప్రీంకోర్టుచిదంబరం సీబీఐ కస్టడీని పొడిగించిన సుప్రీంకోర్టు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత 5, తర్వాత నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి ఇచ్చారు. సెప్టెంబర్ 2తో కస్టడీ గడువు ముగియడంతో చిదంబరం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు.

Trial court extends Chidambarams CBI custody by one day

ట్రయల్ కోర్టులో విచారించాలని .. తీహర్ జైలుకు మాత్రం తరలించొద్దని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. చిదంబరం వయస్సు 76 ఏళ్లు అని .. అతని వయస్సును పరిగణలోకి తీసుకొని తీహర్ జైలుకు తరలించొద్దని సూచించారు. ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ కేసు పరిణామాలు, తీవ్రత దృష్ట్యా సీబీఐ కస్టడీకి ఇచ్చేందుకు జడ్జీ అజయ్ కుమార్ అంగీకరించారు. మంగళవారం వరకు చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి ఇచ్చారు.

English summary
Delhi court on Monday granted the CBI's request one more day of custodial interrogation of former finance minister P Chidambaram in the INX Media corruption case. Special Judge Ajay Kumar Kuhar delivered the order after hearing the arguments by the CBI and Chidambaram's counsel. Chidambaram was produced before the court on expiry of his three-day CBI custody which was granted on August 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X