Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: డాక్టర్ ప్రియుడిని హత్య చేసింది అందుకుకాదు, కంపెనీలో ప్రియురాలికి !

బెంగళూరు/ చెన్నై: డాక్టర్ కు, ఆర్కిటెక్ గా ఉద్యోగం చేస్తున్న యువతికి పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం ప్రేమకు దారి లతీసింది. ఇద్దరూ చెన్నైకి చెందినవారు కావడంతో వాళ్ల పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రియుడు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తుంటూ ఐటీ హబ్ బెంగళూరులో ప్రియురాలు ఉద్యోగం చేస్తోంది. ఉన్నత చదువుల కోసం డాక్టర్ ప్రియురాలు ఉంటున్న బెంగళూరు వచ్చాడు. తరువాత ప్రియురాలు, డాక్టర్ ప్రియుడు కలిసి ఒకే ఇంటిలో సహజీవనం చేస్తున్నారు. ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి లేడీ ఆర్కిటెక్ ఆమె డాక్టర్ ప్రియుడిని ఇటీవల దారుణంగా చంపేసింది. డాక్టర్ ను ఆమె ప్రియురాలు ఎందుకు హత్య చేయించింది ? అనే విషయంలో అసలు మ్యాటర్ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అసలు మ్యాటర్ తెలుసుకున్న డాక్టర్ కుటుంబ సభ్యులు, పోలీసులు సైతం షాక్ అయ్యారు.

 డాక్టర్ లవర్

డాక్టర్ లవర్

చెన్నై సిటీలో ప్రతిభా అలియాస్ ప్రతీషా (25) అనే యువతి, వికాస్ అనే యువకుడు నివాసం ఉంటున్నారు. వికాస్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రతిభా అలియాస్ ప్రతీషా ఆర్కికెట్ గా ఉద్యోగంలో చేరింది. రెండు సంవత్సరాల క్రితం డాక్టర్ వికాస్, ప్రతిభాకు సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. తరువాత వికాస్, ప్రతిభా ప్రేమించుకున్నారు.

 బెంగళూరు వెళ్లిపోయిన ప్రియురాలు

బెంగళూరు వెళ్లిపోయిన ప్రియురాలు

వికాస్, ప్రతిభా ఇద్దరూ చెన్నై సిటీకి చెందినవారు కావడంతో వికాస్, ప్రతిభాల పెళ్లికి ఇరువైపుల కుటుంబ సభ్యులు, పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రియుడు డాక్టర్ వికాస్ చెన్నైలోనే ప్రాక్టీస్ చేస్తుంటూ ప్రతిభా ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని బీటీఎం లేఔట్ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

 ప్రియురాలి ఫ్లాట్ లో ప్రియుడు

ప్రియురాలి ఫ్లాట్ లో ప్రియుడు

డాక్టర్ వికాస్ ఉన్నత చదువుల కోసం కోచింగ్ తీసుకోవడానికి కొన్ని నెలల క్రితం బెంగళూరు వచ్చాడు. బెంగళూరులోని సిల్క్ బోర్డ్ సమీపంలోని బీటీఎం లేఔట్ లో ప్రియురాలు ప్రతిభా నివసం ఉంటున్న ఇంటిలోనే ఉంటున్న డాక్టర్ వికాస్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ప్రియురాలు ప్రతిభా ఇంటిలోనే ఉంటున్న ఆమె డాక్టర్ ప్రియుడు వికాస్ ఆమెతో సహజీవనం చేశాడు.

 పగ తీర్చుకున్న ప్రియుడు

పగ తీర్చుకున్న ప్రియుడు

ప్రియురాలు ప్రతిభాతో బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తున్న సమయంలో డాక్టర్ వికాస్ సీక్రేట్ గా వీడియోలు తీశాడు. ప్రతిభా బెడ్ రూమ్ లో ఏకాంతంగా ఉన్న సమయంలో వికాస్ వీడియోలు తీశాడు. ప్రియురాలు ప్రతిభా తల్లి వ్యక్తిగతంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసిన డాక్టర్ వికాస్ నకిలి సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి ఆ వీడియోలు, ఫోటోలు అందులో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

 ప్రియుడిని చంపేసిన గర్ల్ ఫ్రెండ్

ప్రియుడిని చంపేసిన గర్ల్ ఫ్రెండ్

తన తల్లి, తన వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని ప్రియురాలు ప్రతిభాకు తెలిసి రగిలిపోయింది. ప్రతిభా ఆమె బాయ్ ఫ్రెండ్స్ సుశీల్ (26), సూర్యా (25), గౌతమ్ (27)తో కలిసి డాక్టర్ వికాస్ హత్యకు పక్కాస్కెచ్ వేసింది. సుశీల్ గత నెల 10వ తేదీన సుశీల్ డాక్టర్ వికాస్ కు ఫోన్ చేసి బీటీఎం లేఔట్ లోని మా ఇంటికి రావాలని పిలిపించారు. సుశీల్ ఇంటికి వెళ్లిన డాక్టర్ వికాస్ ను అతని ప్రియురాలు ప్రతిభాతో పాటు సూర్యా, గౌత్ కలిసి చంపేశారు.

 ప్రియురాలు అందర్

ప్రియురాలు అందర్

డాక్టర్ వికాస్ హత్య కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అతని ప్రియురాలు ప్రతిభా, గౌతమ్, సుశీల్ ను అరెస్టు చేశారు. ఇదే కేసులో సూర్యా తప్పించుకున్నాడని పోలీసులు అన్నారు. తన వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి మా పరువు తీసిన డాక్టర్ వికాస్ ను నేనే హత్య చేయించానని ఆర్కిటెక్ ప్రతిభా అంగీరించిందని బేగూరు పోలీసులు తెలిపారు.

 మ్యాటర్ వేరే మిత్రమా

మ్యాటర్ వేరే మిత్రమా

డాక్టర్ వికాస్ హత్య కేసులో నెల రోజుల తరువాత ఊహించి ట్విస్ట్ బయటపడింది. డాక్టర్ వికాస్ ను ప్రేమించిన అతని ప్రియురాలు ప్రతిభా అంతకు ముందే ఆమె పని చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేసే సుశీల్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 పెళ్లి చేసుకుంటే డాక్టర్ టార్చర్ పెడుతాడని ?

పెళ్లి చేసుకుంటే డాక్టర్ టార్చర్ పెడుతాడని ?

ప్రియురాలు ప్రతిభా సుశీల్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని డాక్టర్ ప్రియుడు వికాస్ కు తెలిసిపోయిందని, తరువాతే ఆమె పర్సనల్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో రీలీజ్ చేశాడని సోమవారం బెంగళూరు పోలీసులు తెలిపారు. డాక్టర్ వికాస్ ను పెళ్లి చేసుకున్న తరువాత సుశీల్ తో తాను అక్రమ సంబంధం పెట్టుకున్న విఫయం బయటపడితే తనను వికాస్ టార్చర్ పెడుతాడని ప్రతిభా భయపడిందని, తరువాత డాక్టర్ వికాస్ హత్యకు స్కెచ్ వేసిందని బెంగళూరు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+