చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత మృతిపై కామెంట్, శశికళ ఫ్యామిలీలో చిచ్చు, దినకరన్ తెలివిగా, చూశాను !

|
Google Oneindia TeluguNews

Recommended Video

జయలలిత మృతిపై కామెంట్.. శశికళ ఫ్యామిలీలో చిచ్చు !

చెన్నై: జయలలిత మృతి విషయంలో శశికళ సోదరుడు దివాకరన్ చేసిన వ్యాఖ్యలు వారి ఫ్యామిలీలో చిచ్చు రేపాయి. జయలలిత మృతి గురించి దివాకరన్ కు ఏం తెలుసు ? అని మాట్లాడుతున్నారు, ఆయన దగ్గర ఏమైనా సాక్షాలు ఉన్నాయా ? అని ప్రశ్నిస్తున్నారు. అయితే టీటీవీ దినకరన్ మాత్రం తెలివిగా తప్పించుకుంటున్నారు.

ఏం తెలుసు ?

ఏం తెలుసు ?

జయలలిత మృతి గురించి దివాకరన్ కు ఏం తెలుసు ? అని మాట్లాడుతున్నారు అని శశికళ మేనకోడలు క్రిష్ణప్రియ ప్రశ్నిస్తున్నారు. గత డిసెంబర్ నెలలో జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో విడుదల చేసి రాద్దాంతం చేశారని క్రిష్ణప్రియ మండిపడుతున్నారు.

 నిజాలు దాచిపెట్టారా ?

నిజాలు దాచిపెట్టారా ?

జయలలిత మృతిపై నిజాలను ఎవ్వరూ దాచిపెట్టడం లేదని, అమ్మ విషయంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని క్రిష్ణప్రియ అన్నారు. అనవసరంగా జయలలిత విషయంలో లేనిపోని వ్యాఖ్యలు చేసి ఆమె అభిమానులను అయోమయానికి గురి చెయ్యరాదని క్రిష్ణప్రియ మనవి చేశారు.

టీటీవీ దినకరన్

టీటీవీ దినకరన్

శశికళ సోదరుడు దివాకరన్ జయలలిత మృతి తేదీ మార్పుపై చేసిన వ్యాఖ్యలపై ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ను మీడియా ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలీదని చెప్పారు. తెలియని విషయాల గురించి మాట్లాడటం మంచిదికాదని టీటీవీ దినకరన్ తెలివిగా తప్పించుకున్నారు.

ఆరోజు చూశాను

ఆరోజు చూశాను

2016 డిసెంబర్ 4వ తేదీ తాను అపోలో ఆసుపత్రిలో జయలలితను చూశానని, ఆ సమయంలో అమ్మకు ఈసీఎంఓ (Extra corporeal membrane oxygenation)ను అమర్చారని టీటీవీ దినకరన్ మీడియాకు చెప్పారు.

రెబల్ ఎమ్మెల్యే

రెబల్ ఎమ్మెల్యే

శశికళ సోదరుడు దివాకరన్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యే, టీటీవీ దినకరన్ ప్రధాన అనుచరుడు తంగ తమిళ సెల్వన్ మండిపడ్డారు. జయలలిత విషయంలో ఇలాంటి లేనిపోని వ్యాఖ్యలు చెయ్యడం మంచిదికాదని తంగ తమిళ సెల్వన్ హెచ్చరించారు.

దివాకరన్ దెబ్బతో !

దివాకరన్ దెబ్బతో !

జయలలిత 2016 డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు మరణించారని, అపోలో ఆసుపత్రి వర్గాలు మాత్రం డిసెంబర్ 5వ తేదీ మరణించారని ప్రకటించారని శశికళ సోదరుడు దివాకరన్ మన్నార్ గుడిలో జరిగిన ఎంజీఆర్ జయంతి వేడుకల్లో బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

English summary
RK Nagar MLA TTV Dhinakaran has distanced himself from a claim made by his uncle Dhivakaran, that former chief minister Jayalalithaa died on December 4, 2016 and not on December 5 as officially announced by Apollo Hospitals. TTV Dinakaran supporting Ex MLA Thanga Tamilselvan has opposed to Divakaran's comments on Jayalalithaa's death date.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X