వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్ బాధ్యతలు, పన్నీర్ ఎంఏల్ఏలకు వల ఇలా....

అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా దినకరన్ గురువారం నాడు భాద్యతలు స్వీకరించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా దినకరన్ గురువారం నాడు భాద్యతలు స్వీకరించారు. జైలుకు వెళ్ళే రోజు తెల్లవారుజామున పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా దినకరన్ గా నియమించారు. పన్నీర్ వెంట వెళ్ళిన ఎంఏల్ఏలు తిరిగి వస్తే ఆహ్వనిస్తామన్నారు దినకరన్.

అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా దినకరన్ గురువారం నాడు పార్టీ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు.అయితే సుప్రీంకోర్టు జయలలిత అక్రమాస్తుల కేసులో శిక్ష విధించడంతో ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి పేరును ప్రతిపాదించిన శశికళ, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా దినకరన్ ను నియమించింది.

అన్నాడిఎంకెలో శశికళ తర్వాతి స్థానంలో దినకరన్ ఉన్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళ పరప్పర అగ్రహర జైలులో శిక్ష అనుభవిస్తోంది.

TTV Dinakaran takes charge as AIADMK Deputy General Secretary

జయలలిత నను పార్టీలోకి ఆహ్వానించారని కీలక పదవులను కట్టబెట్టారని అమ్మ వల్లే తాను గతంలో ఎంపిగా కూడ పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్నాడిఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడారు.

పన్నీర్ సెల్వం వెంట వెళ్ళిన ఎంఏల్ఏలు, ఎంపిలను తిరిగి పార్టీలోకి ఆహ్వనిస్తున్నామన్నారు. అమ్మ ఆశయాలను పాలనను కొనసాగిస్తామని దినకరన్ చెప్పారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పారు.

English summary
AIADMK general secretary VK Sasikala had appointed her nephew Dinakaran as party deputy general secretary on February 15, ahead of surrendering before the court.The appointment of her nephew in the newly-created post was announced a day after the Supreme Court upheld Sasikala's conviction in the disproportionate assets case.TTV Dinakaran takes charge as AIADMK Deputy General Secretary on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X