Earthquke: భారత్‌లో త్వరలో టర్కీ తరహా తీవ్ర భూకంపం..!
భారతదేశంలోనూ టర్కీ తరహాలో భూకంపాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: టర్కీ-సిరియాలో ఇటీవల పెను భూకంపం సంభవించి దాదాపు అర లక్ష మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కూడా పలుమార్లు భూకంపాలు కొంచం తక్కువ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. ఇది లావుండగా, భారతదేశంలోనూ టర్కీ తరహాలో భూకంపాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మనదేశంలోనూ పెను భూకంపాలు
మనదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రానున్న కాలంలో టర్కీ తరహాలో భూకంపాలు చోటు చేసుకునే అవకాశం ఉందని నేషలన్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) సీస్మాలజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్ పూర్ణచందర్ రావు హెచ్చరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పెను భూకంపాలు చోటు చేసుకునే అవకాశం దగ్గరలోనే ఉందని తెలిపారు.

ఉత్తరాఖండ్‌లో భూకంపాలు
అయితే, ఈ ప్రాంతంలో భూకంపం ఎప్పుడు, ఎలా సంభవిస్తుందనే విషయం మాత్రం చెప్పలేమని పూర్ణచందర్ రావు పేర్కొన్నారు. ఈ భూకంపాల తీవ్రత వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంభవించే భూకంపాల గురించి తెలుసుకునేందుకు హిమాలయ ప్రాంతాల్లో 80 సిస్మిక్ స్టేషన్లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకునేందుకు పరిశోధనలు జరుపుతున్నట్లు తెలిపారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ భూకంపాల హెచ్చరిక
జీపీఎస్ నెట్‌వర్క్స్ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నామని డాక్టర్ పూర్ణచందర్ రావు తెలిపారు. అవి కదలికలను తెలియజేస్తున్నాయని తెలిపారు. భూమిలో ఏం జరుగుతుందో అని కనుగొనేందుకు ఈ ప్రక్రియ సమర్థవంతంగా ఉందని చెప్పారు. ఖచ్చిత మైన తేదీ, సమయం చెప్పలేం కానీ.. ఉత్తరాఖండ్ మాత్రంలో రానున్న కాలంలో భారీ భూకంపాన్ని ఎదుర్కోబోతోందని ఆయన హెచ్చరించారు. వేరియోమీటర్లు భూమి అయస్కాంత క్షేత్రంలో వైవిధ్యాలను కొలుస్తాయని తెలిపారు.

జమ్మూకాశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు భూకంప జోన్‌లోనే
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్‌లో అనేక నివాసాలు భూమిలోకి కుంగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ శాస్త్రవేత్త భూకంపాలకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. బద్రినాథ్, కేదారినాథ్, చార్‌ధామ్ యాత్రల క్రమంలో ఈ ప్రాంతానికి ఎప్పుడూ భక్తుల తాకడి ఎక్కువగా ఉంటుంది. హిమాలయ ప్రాంతంలోని జమ్మూకాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ రవకు భూకంపాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ఇక్కడ 8 తీవ్రతతో భూకంపాలు తీవ్ర భూకంపాలు సంభవించే అవకాశం ఉందన్నారు. టర్కీ తరహాలో లేదంటే అంతకుమించి భూకంప తీవ్రత ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, హిమాలయ ప్రాంతం భూకంప జోన్‌లోనే ఉండటం గమనార్హం. గతంలోనూ ఇక్కడ భారీ భూకంపాలు సంభవించిన చరిత్ర ఉంది.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications