దెబ్బ మీద దెబ్బ.. పోలింగ్ సమీపిస్తున్న వేళ విజయ్‌కు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ !
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న టీవీకే అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తుల వివరాల వెల్లడిలో తీవ్ర వ్యత్యాసాలున్నాయని పేర్కొంటూ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా, రెండు వేర్వేరు నియోజకవర్గాలకు దాఖలు చేసిన అఫిడవిట్లలోని అంకెలు సరిపోలకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
చెన్నైకు చెందిన విఘ్నేష్ పిటిషన్ మేరకు, విజయ్ పెరంబూర్ అఫిడవిట్‌లో ₹115.13 కోట్ల ఆస్తులున్నట్లు, తిరుచ్చి తూర్పులో మాత్రం ₹220.15 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ₹105 కోట్ల భారీ వ్యత్యాసంపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్ కోరారు.

మద్రాసు హైకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ ఒక నియోజకవర్గంలో వంద కోట్లకు పైగా ఆస్తులను వెల్లడించకపోవడం తీవ్రమైన అక్రమమని వ్యాఖ్యానించింది. దీనిపై విజయ్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, ఐటీ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్, రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.
పోలింగ్ తేదీ అయిన ఏప్రిల్ 23లోపు విచారణ నివేదికను ప్రజలకు వెల్లడించింది. ఓటర్లు సరైన నిర్ణయం తీసుకునేందుకు సహకరించాలని పిటిషనర్ అభ్యర్థించగా.. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఆస్తుల దాపరికం రుజువైతే, అది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications