ప్రధాని మోడీ నిషాలో మాట్లాడారు: నటి రమ్య కామెంట్, నీ పేరులోనే రమ్ ఉంది, జాగ్రత్త!
Recommended Video

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, మాజీ ఎంపీ, బహుబాషనటి రమ్య చేసిన వివాదాస్పద ట్వీట్ పై సెలబ్రిటీలతో పాటు పలువురు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో నటి రమ్యను ఉతికి ఆరేస్తున్నారు. నీ పేరులోనే రమ్
ఉందని, నీవే మద్యం మత్తులో, నిషాలో ట్వీట్ లు చేస్తుంటావని మండిపడుతున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే తగిన బుద్ది చెబుతామని నటి రమ్యను హెచ్చరిస్తున్నారు.

బెంగళూరులో మోడీ
ఆదివారం బెంగళూరులో జరిగిన బీజేపీ పరివర్తనా యాత్ర బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. రైతుల క్షేమం కోసం తాము ఏమైనా చేస్తామని, వారే దేశానికి అండగా ఉంటారని, రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ
ఆరోపించారు.

టమోటో, ఉల్లి
రైతులు పండించే టమోటో, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు తాము మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, నిత్యం రైతులకు అండగా ఉంటామని ప్రధాని మోడీ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంతో కర్ణాటకలో 3, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.

నటి రమ్య కామెంట్
బెంగళూరుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నిషాలో (మద్యం మత్తులో) మాట్లాడి వెళ్లారని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాలు, బహుబాష నటి రమ్య ట్వీట్ చేశారు. నటి రమ్య చేసిన ట్వీట్ వివాదాస్పదానికి దారి తీసింది. రమ్య కామెంట్ పై పలువురు మండి పడుతున్నారు.

రమ్య ఎవరు ? హీరో జగ్గేష్
అసలు రమ్య ఎవరు, ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఆమెకు ఏం తెలుసు, దేశంలోనే ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ఆమెకు కన్నడ మాట్లాడటం సరిగా రాదని ప్రముఖ కన్నడ హీరో జగ్గేష్ మండిపడ్డారు.

రమ్య పేరులోనే రమ్
రమ్య పేరులోనే రమ్ ఉందని, రమ్ తాగేసి ఆమె సోషల్ మీడియాలో కామెంట్ చేస్తుందని గోల్టన్ స్టార్ గణేష్ భార్య, కర్ణాటక బీజేపీ మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు శిల్ప గణేష్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, లేదంటే బీజేపీ మహిళా మోర్చ కార్యకర్తలు తగిన బుద్ది చెబుతారని రమ్యను శిల్పా గణేష్ హెచ్చరించారు. మొత్తం మీద వివాదాస్పద ట్వీట్ చేసిన నటి రమ్య మీద సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications