స్మార్ట్ సిటీ పేరుతో రూ.2,676 కోట్లు స్వాహా చేసిన అన్నదమ్ములు..!
పేద, మధ్య తరగతి, ధనిక అనే తారతమ్యాలు లేకుండా సగటు మనిషికి ఉండే కోరికల్లో సొంత ఇళ్లు కూడా ఒకటి. సామాన్యుల ఆశలని ఆసరాగా చేసుకొని భారీ స్కామ్ చేశారు ఓ అన్నదమ్ముళ్లు. సుమారు 70,000 మంది నుంచి రూ.2,676 కోట్లు కొల్లగొట్టారు. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ధోలేరా స్మార్ట్ సిటీ పేరుతో..
ఈ భారీ స్కాంకి సూత్రధారులు రాజస్థాన్‌కు చెందిన సుభాష్ బిజారాణి, రణ్‌వీర్ బిజారాణి అనే అన్నదమ్ములు. 2014లో రణ్‌వీర్ ధోలేరాలో కొంత భూమి కొనగా.ఆర్మీ నుంచి రిటైరైన సుభాష్ 2021లో సోదరుడితో కలిసి అహ్మదాబాద్‌లో కంపెనీని రిజిస్టర్ చేసి ఈ మోసానికి పాల్పడ్డారు. 'నెక్సా ఎవర్ గ్రీన్' అనే కంపెనీ పేరుతో.. 'ధోలేరా స్మార్ట్ సిటీ'లో ప్లాట్లను విక్రయించారు. అధిక లాభాలు ఆశ చూపి సుమారు 70,000 మంది నుంచి రూ.2,676 కోట్లు సేకరించారు.

తమ కంపెనీ ప్రతిష్ఠాత్మక 'ధోలేరా స్మార్ట్ సిటీ' ప్రాజెక్టులో భాగమని.. తమకున్న 1,300 బీగాల భూమిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ప్రచారం చేశారు. ఫ్లాట్లు, పెట్టుబడి పథకాల ద్వారా భారీ లాభాలు, కమీషన్లు, బహుమతులు (ల్యాప్‌టాప్‌లు, బైక్‌లు, కార్లు) ఇస్తామని కస్టమర్లకు ఆశ జూపారు. అంతే కాకుండా పలువురిని కీలక అధికారులుగా, వేలాది మందిని ఏజెంట్లుగా నియమించుకున్నారు. వారికి దాదాపు రూ.1,500 కోట్లను కమీషన్ల రూపంలోనే ఇచ్చినట్టు సమాచారం.
ఇక వసూలు చేసిన సొమ్ముతో మొదట 1,300 బీగాల భూమి కొని.. ఆ తర్వాత రాజస్థాన్‌లో విలాసవంతమైన కార్లు, గనులు, హోటళ్లు, అహ్మదాబాద్‌లో ఫ్లాట్లు, గోవాలో 25 రిసార్టులు కొన్నారు. సుమారు రూ.250 కోట్లు నగదుగా ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని 27 నకిలీ కంపెనీలకు మళ్లించారు. ఆ సమయంలోనే వారి మోసం బయటపడటంతో నిందితులు పరారయ్యారు. మోసపోయామని గ్రహించిన వారు పోలీసులను ఆశ్రయించగా.. జోధ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సైతం రంగంలోకి దిగి జూన్ 12న రాజస్థాన్, గుజరాత్‌లలోని 25 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసింది.
అందుకే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పేరుతో వస్తున్న స్కీమ్‌లు చూస్తే వెంటనే పెట్టుబడి పెట్టకుండా ఆలోచించి ముందడుగు వేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎంత పెద్ద కంపెనీ అయినా, మొదట లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్లు, రిజిస్ట్రేషన్లు, అనుమతుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
కాగా 'ధోలేరా స్మార్ట్ సిటీ' వాస్తవానికి కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్. ఇది దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దనున్నారు. 920 చ.కి.మీ. విస్తీర్ణంలో ఢిల్లీ కంటే రెట్టింపు పరిమాణంలో అంతర్జాతీయ విమానాశ్రయం, మల్టీ నేషనల్ కంపెనీలతో 2042 నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పేరు మీదే నిందితులు మోసాలకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications