ఇద్దరు అమ్మాయిలు పారిపోయి పెళ్లి చేసుకున్నారు

 Two girls elope, marry each other in Bihar
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో ఇద్దరు అమ్మాయిలు తమ తమ ఇళ్ల నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఒకే లింగానికి చెందిన ఇద్దరు వివాహం చేసుకోవడం బహుశా రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావచ్చు. ఓ అమ్మాయికి చెందిన కుటుంబ సభ్యులు మరో అమ్మాయి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు.

దాంతో పోలీసులు వారి కోసం వేట ప్రారంభించారు. ఇద్దరు అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో గల సాసారాంలోని ఓ హోటల్లో బస చేశారు. అక్కడ పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నారు.

మొబైల్ ఫోన్ లోకేషన్ ద్వారా వారిని పోలీసులు పట్టుకున్నారు. వారిని పాట్నాలోని కోర్టులో హాజరు పరిచారు. వారిద్దరు అక్టోబర్ 4వ తేదీన పారిపోయారు. సాసారాంలోని ఓ దేవాలయంలో ఇరువురు వివాహం చేసుకున్నారు.

అమ్మాయిలు ఇద్దురు కూడా బాల్య స్నేహితులు. కలిసి చదువుకున్నారు. దాంతో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ అమ్మాయిల ఉదంతాన్ని పోలీసులు సోమవారంనాడు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+