సిబిఐ: ఇద్దరు గవర్నర్లు ఔట్, నరసింహన్ కూడా?

Two Governors Quit After Interrogation, Will a Third Follow
న్యూఢిల్లీ: ఆగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం కేసులో విచారణను ఎదుర్కున్న ఇద్దరు గవర్నర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ కేసులో విచారణను ఎదుర్కోనున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా రాజీనామా చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణం కేసులో సాక్షులుగా విచారణను ఎదుర్కున్న తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఎంకె నారాయణన్, గోవా గవర్నర్‌గా బివి వాంచూ రాజీనామాలు చేశారు. గత వారం సిబిఐ అధికారులు వారిద్దరినీ విచారించారు.

ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను బుధవారం సిబిఐ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నరసింహన్‌ను కూడా సిబిఐ అధికారులు సాక్షిగా విచారించనున్నారు.

హెలికాప్టర్ల కొనుగోలు కోసం సంబంధించి అధికారులు సాంకేతికపరమైన వివరాలు తీసుకున్న సమయంలో నరసింహన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా ఉన్నారు. నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. అలాగే బీవీ వాంచూ స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్ హెడ్‌గా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+