Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీకి షాక్, అప్ప ఇంట్లో మీటింగ్ లో సొంత పార్టీ ఎమ్మెల్యేలు డుమ్మా, అదే జరిగితే ?

బెంగళూరు: గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు మళ్లీ కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్తల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్‌. యడ్యూరప్ప ఇంట్లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.

కాంగ్రెస్‌ హస్తం ఆపరేషన్‌లో కొందరు అసంతృప్త బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే అనుమానంతో బీజేపీ సీనియర్ లీడర్ బీఎస్‌ యడ్యూరప్ప స్వయంగా రంగంలోకి దిగారు. కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్, మాజీ డీసీఎం ఆర్. అశోక సహా పలువురు నేతలతో యడియూరప్ప ఇంటిలో సమావేశం నిర్వహించి బీజేపీ ఎమ్మెల్యేలు అందరిని ఆహ్వానించారు.

Two MLAs who disappeared without attending the meeting of BJP MLAs held at Yeddyurappas house
బీఎస్ యడియూరప్ప తన నివాసంలో రెండు గంటలపాటు జరిగిన సమావేశం తర్వాత, కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడే ఆలోచనలో లేరని, ఎమ్మెల్యేలు ఎవరూ బయటకు వెళ్లలేదని యడ్యూరప్ప చెప్పారు. వివిధ కారణాలతో పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోందని, అయితే బీజేపీని ఎవరూ వీడరని యడ్యూరప్ప విలేఖరులతో అన్నారు.

యడ్యూరప్ప నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బోమ్మయ్, డీవీ. సదానంద గౌడ, సీనియర్ ఎమ్మెల్యే ఆర్.అశోక, బీజేపీ ఎమ్మెల్యేలుహాజరయ్యారు. 2019 రాజకీయ సంక్షోభం సమయంలో పార్టీ ఫిరాయించిన వారితో సహా బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీ ఆకర్షించే అవకాశం ఉందని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ఇదే వారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Two MLAs who disappeared without attending the meeting of BJP MLAs held at Yeddyurappas house

ఎస్ టీ. సోమశేఖర్, బైరతీ బసవరాజ్, కే. గోపాలయ్య, మునిరత్న, శివరామ్ హెబ్బార్‌లు బీజేపీ నుంచి కాంగ్రెస్ కు జంప్ అవుతున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో వారి మీద బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పార్టీ ఫిరాయించి 2019లో బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరించిన 17 మంది ఎమ్మెల్యేల్లో వీరు కూడా ఉన్నారు.

అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీకి ఎలా దూరమయ్యారో ఈ సమావేశంలో తేలింది. 17 మంది ఫిరాయింపుదారులలో 16 మంది కర్ణాటకలో బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడు అయిన యడ్యూరప్పను నమ్మి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అప్పట్లో బీజేపీలో చేరారు. తరువాత యడియూరప్పను సీఎం చేసిన రెబల్ ఎమ్మెల్యేలు తరువాత మంత్రులు అయ్యారు.

Two MLAs who disappeared without attending the meeting of BJP MLAs held at Yeddyurappas house

గతంలో కాంగ్రెస్‌లో ఉన్న సోమశేఖర్ తన యశ్వంత్‌పూర్ నియోజకవర్గానికి చెందిన స్థానిక బీజేపీ నేతలపై అసంతృప్తితో ఉన్నారని బహిరంగంగానే చెప్పారు. దీనికి ముందు మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని కలుసుకుని ఇదే విషయం గురించి మాట్లాడారు. అయితే యడ్యూరప్ప నివాసంలో జరిగిన సమావేశానికి ఎస్ టీ, సోమశేఖర్ తో పాటు కేఆర్ పురం ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ కూడా హాజరు కాలేదు.

ఇప్పుడు బీజేపీ నాయకుల్లో గుబులు మొదలైయ్యింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ లో చేరిపోతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ సీనియర్ నాయకులు ఇద్దరు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యేల్లో సీనియర్ అధికారుల తీరుతో కొందరు విసిగిపోతున్నారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+