రెండు వారాళ్లో పెళ్లి, బాత్ రూమ్ లో పెళ్లికూతురు ఏం చేసిందంటే ?, పెళ్లికొడుకు మైండ్ బ్లాక్ !
డిగ్రీ పూర్తి చేసిన యువతి పీజీ చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. పీజీ పూర్తి చేసిన తరువాత తాను మంచి ఉద్యోగం చేస్తానని, అప్పుడు మంచి పెళ్లి సంబంధాలు వస్తాయని యువతి కుటుంబ సభ్యులకు నచ్చచెప్పింది. పీజీ పూర్తి చేసిన యువతి ఉద్యోగం చేస్తున్నది. అయితే యువతికి హడావిడిగా పెళ్లి చెయ్యడానికి పెద్దలు అన్ని ఏర్పాటు చేశారు. పెళ్లికి రెండు వారాల ముందు ఆ యువతి బాత్ రూమ్ లో శవమై కనిపించింది.
పెళ్లికి 13 రోజుల ముందు ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా కట్టెహక్లు గ్రామంలో చోటుచేసుకుంది. చైత్రా (26) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు. చైత్రా మృతదేహం ఆమె ఇంట్లోని బాత్‌రూమ్‌లో వేలాడుతూ కనిపించింది.

మృతురాలు చైత్రా వివాహం వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీన జరగాల్సి ఉంది.
అయితే అకస్మాత్తుగా చైత్రా మృతి చెందింది. చైత్రా ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. కుటుంబ సభ్యులు చైత్రా పెళ్లి నిశ్చయించారు. అయితే తాను పెళ్లి చేసుకోనని చైత్రా ఆమె కుటుంబ సభ్యులకు అభ్యంతరం చెప్పింది. అయితే కుటుంబీకులు చైత్రాను పెళ్లికి ఒప్పించి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం జరిగిపోవడంతో చైత్రా పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేశారు.
తనకు పెళ్లి ఇష్టం లేదని, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే తాను పెళ్లి చేసుకోనని చైత్రా ఆమె తల్లిదండ్రులకు పదేపదే చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని తెలిసింది. తను ఎందుకు పెళ్లి చేస్తున్నారు అంటూ చైత్రా ఆమె తల్లిని ఇటీవల నిలదీసిందని తెలిసింది. అయినా పెళ్లికి చకచకా పనులు చేస్తుండటంతో జీవితంపై వరక్తి పెంచుకున్న చైత్రా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చైత్రా ఎం.కామ్ పూర్తి చేసింది. కట్టెహక్లాలోని రామకృష్ణ మెడికల్స్ లో చైత్రా ఉద్యోగం చేస్తోంది. తీర్థహళ్లి పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications