పెళ్లి వేడుకలు: మహిళలకు బుల్లెట్ గాయాలు
ఘజియాబాద్: వివాహ వేడుకలు జరుగుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. ఎదో చెయ్యాలని భావించిన పెళ్లి బృందం షాక్ కు గురైనారు. వారు నిర్లక్ష్యంగా కాల్పులు జరపడంతో ఇద్దరు మహిళలకు బుల్లెట్ గాయాలై ఆసుపత్రి పాలై మృత్యువుతో పోరాడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ నగరంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఘజియాబాద్ లో శుక్రవారం రాత్రి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. పెళ్లి బరాత్ వేడుకలలో భాగంగా పెళ్లి కుమారుడు గుర్రం మీద కుర్చుని ఊరేగింపుగా వెళుతున్నాడు.
అదే సమయంలో అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు రోడ్ల మీద బాణాసంచా కాల్చుకుంటు డ్యాన్స్ లు వేసుకుంటు వెళుతున్నారు. వీరి హంగామా ఎక్కువ కావడంతో చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారు భవనాల మీద నిలబడి ఊరేగింపును చూస్తున్నారు.

అదే సమయంలో పెళ్లి కుమారుడి బంధవులు తుపాకులు తీసుకుని డ్యాన్స్ లు వేస్తూ గాలిలోకి కాల్పులు జరిపారు. అంతే పైకి వెళ్లవలసిన బుల్లెట్ లు భవనం మీద నిలబడి ఉన్నమీనాక్షి, సుమన అనే ఇద్దరు మహిళల శరీరంలోకి దూసుకు వెళ్లాయి.
వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలిలోకి కాల్పులు జరిపిన వారు అక్కడి నుండి అప్పటికే పరారైనారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications