ఢిల్లీ క్యాబ్ రేప్: ఉబేర్ జనరల్ మేనేజర్‌పై దాడి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజధాని ముంబై కలెక్టర్ కార్యాలయం వెలుపల ఉబేర్ జనరల్ మేనేజర్‌పై బుధవారం దాడి జరిగింది. దాడికి పాల్పడింది స్వాభిమాన్ సంఘటన్ కార్యకర్తలని భావిస్తున్నారు. కాగా, గత ఆరు నెలలుగా దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరగడం పట్ల ప్రతిపక్ష సభ్యులు లోకసభలో ఆందోళన వ్యక్తం చేశారు. నిషేధం విధించినప్పటికీ ఢిల్లీ ఉబేర్ టాక్సీలు తిరుగుతున్నాయని కాంగ్రెసు సభ్యుడొకరు అన్నారు.
శుక్రవారం రాత్రి ఢిల్లీలో 27ఏళ్ల మహిళ క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్‌కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్‌లో పనిచేస్తోంది.

మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు.
కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది. ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications