Negligence: ఆరోజు ఏఎస్ఐ చేసిన తప్పుకు ఇంత జరిగింది, జస్ట్ సస్పెండ్, ప్రధానికి వార్నింగ్ ఇచ్చి !

ఉదయ్ పూర్/ రాజస్థాన్: ఇస్లాం మతాన్ని అవమానించారని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ ను అతి కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. టైలర్ కన్హయ్య లాల్ హత్యతో ఉదయ్ పూర్ ఉడికిపోతోంది. ఉదయ్ పూర్ లో ఇప్పటికే కర్ఫ్యూ అమలులో ఉంది. నెల రోజుల పాటు రాజస్థాన్ మొత్తం 144 సెక్షన్ విధించారు. టైలర్ కన్హయ్యను దారుణంగా హత్య చేసిన నిందితులు రియాజ్ ఆఖ్తారీ, గౌస్ మోహమ్మద్ ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే కన్హయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనను చంపేస్తామని కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ పని చేసే ఏఎస్ఐ నువ్వు కేవలం ఒక టైలర్, నిన్ను ఎవడు చంపుతాడు అంటూ నిర్లక్షంగా మాట్లాడారని, తరువాత రెండు వర్గాల వారిని రాజీ చేసి పంపించాడని వెలుగు చూసింది. ఆ రోజు కన్హయ్య లాల్ కేసు పెట్టిన వ్యక్తులను అరెస్టు చేసి ఉంటే అతన్ని హత్య చెయ్యడానికి చాన్స్ ఉండేదికాదని, ఉదయ్ పూర్ లో అల్లర్లు జరగడానికి అవకాశం ఉండేదికాదని అధికారుల విచారణలో వెలుగు చూసింది. కన్హయ్య లాల్ కేసులో నిర్లక్షం చేసిన ఏఎస్ఐ మీద రాజస్థాన్ పోలీసు అధికారులు వేటు వేశారు.

 బీజేపీ లీడర్ కు మద్దతు.... అరెస్టు

బీజేపీ లీడర్ కు మద్దతు.... అరెస్టు

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా ఉదయ్ పూర్ కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ సోషల్ మీడియాలో మద్దతు తెలిపారు. పోలీసులు కన్హయ్య లాల్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈనెల 15వ తేదీన కన్హయ్య లాల్ బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చాడు.

 వెంటనే కేసు పెట్టిన కన్హయ్య లాల్

వెంటనే కేసు పెట్టిన కన్హయ్య లాల్

బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే కన్హయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనను చంపేస్తామని కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఉదయ్ పూర్ లోని ధన్ మండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ధన్ మండీ పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్న ఏఎస్ఐ భన్వర్ లాల్ కన్హయ్య లాల్ ను చులకనగా మాట్లాడారని వెలుగు చూసింది.

 రాజీ చేసిన ఏఎస్ఐ

రాజీ చేసిన ఏఎస్ఐ

నువ్వు కేవలం ఒక టైలర్, నిన్ను ఎవడు చంపుతాడు అంటూ ఏఎస్ఐ భన్వర్ లాల్ కన్హయ్య లాల్ ను నిర్లక్షంగా మాట్లాడారని పోలీసు అధికారుల విచారలో వెలుగు చూసింది. తరువాత ఏఎస్ఐ భన్వర్ లాల్ రెండు వర్గాల వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి రాజీ చేసి కన్హయ్య లాల్ కేసు పెట్టకుండా చూసి అందరిని అక్కడి నుంచి పంపించారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 ఏఎస్ఐ చేసిన తప్పుకు ఏం జరిగిందంటే ?

ఏఎస్ఐ చేసిన తప్పుకు ఏం జరిగిందంటే ?

ఆ రోజు కన్హయ్య లాల్ కేసు పెట్టిన వ్యక్తుల మీద ఏఎస్ఐ భన్వర్ లాల్ కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి ఉంటే ఇంత జరిగేది కాదని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఏఎస్ఐ భన్వర్ అప్పుడే నిందితులను అరెస్టు చేసి ఉంటే కన్హయ్య లాల్ హత్య చెయ్యడానికి చాన్స్ ఉండేదికాదని, ఉదయ్ పూర్ లో అల్లర్లు జరగడానికి అవకాశం ఉండేదికాదని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 అంతా అయిపోయిన తరువాత ఏఎస్ఐ జస్ట్ సస్పెండ్

అంతా అయిపోయిన తరువాత ఏఎస్ఐ జస్ట్ సస్పెండ్

కన్హయ్య లాల్ కేసులో నిర్లక్షం చేసిన ఏఎస్ఐ భన్వర్ లాల్ ను సస్పెండ్ చేశామని రాజస్థాన్ లా అండ్ ఆర్డర్ విభాగం ఏడీజీపీ హవాసింగ్ స్థానిక మీడియాకు చెప్పారు. ఇస్లాం మతాన్ని అవమానించారని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ ను అతి కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

 ఎంత ధైర్యం ఉంటే ప్రధానికే వార్నింగ్ ఇచ్చారు

ఎంత ధైర్యం ఉంటే ప్రధానికే వార్నింగ్ ఇచ్చారు

టైలర్ కన్హయ్య లాల్ హత్యతో ఉదయ్ పూర్ ఉడికిపోతోంది. ఉదయ్ పూర్ లో ఇప్పటికే కర్ఫ్యూ అమలులో ఉంది. నెల రోజుల పాటు రాజస్థాన్ మొత్తం 144 సెక్షన్ విధించారు. టైలర్ కన్హయ్యను దారుణంగా హత్య చేసిన నిందితులు రియాజ్ ఆఖ్తారీ, గౌస్ మోహమ్మద్ ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని నిందితులు వార్నింగ్ ఇవ్వడంతో సీరియస్ అయిన కేంద్ర హోమ్ శాఖ కేసును ఎన్ఐఏకి అప్పగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+