Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UGC Equity Regulations 2026:యూజీసీ కొత్త రూల్స్‌ పై సుప్రీంకోర్టు షాక్..!!

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026' నిబంధనలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ నిబంధనలు సమాజాన్ని విభజించేలా ఉన్నాయంటూ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.

దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను అరికట్టేందుకు యూజీసీ ఇటీవల విడుదల చేసిన కొత్త యాంటీ-డిస్క్రిమినేషన్ రూల్స్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. కుల ఆధారిత వివక్షపై యూజీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని మృత్యుంజయ్ తివారీ, అడ్వకేట్ వినీత్ జిందాల్,రాహుల్ దేవాన్‌లు దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ రిట్ పిటిషన్లను విచారణ చేపట్టింది. కొత్త నిబంధనల అమలును తక్షణమే నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని, వీటి వల్ల దుర్వినియోగం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

UGC Equity Regulations 2026

సుప్రీంకోర్టు ఏమందంటే?

యూజీసీ కొత్త నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, కేంద్ర ప్రభుత్వంతో పాటు యూజీసీకి నోటీసులు జారీ చేసింది.ఈ నిబంధనలు స్పష్టంగా లేవని, ఇవి సమాజాన్ని విడదీసేలా లేదా సమాజంలో అలజడి సృష్టించే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.ఈ తరహా నిబంధనలు విద్యా సంస్థలపై తీవ్ర ప్రభావాన్నిచూపుతాయని, అందుకే ఈ విషయంలో జోక్యం చేసుకోవడం అనివార్యమని కోర్టు పేర్కొంది.తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ కొత్త రూల్స్ అమల్లో ఉండవని, 2012 నాటి పాత మార్గదర్శకాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆ పై కేసును 2026 మార్చి 19కి వాయిదా వేసింది.

అంతకుముందు భారత సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు పలు సూచనలు చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ రోజు తాము ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేయడం లేదని, దీనిపై ఒక కమిటీ ఉండాలనేది తమ అభిప్రాయంగా ధర్మాసనం పేర్కొంది. ఈ కమిటీ ఇద్దరూ లేదా ముగ్గురు వ్యక్తులతో నియమించాలని సూచించింది. సామాజిక విలువలు,సమాజం ఎదుర్కొంటున్న వివక్షపై అవగాహన కలిగిన వారు ఈ కమిటీలో సభ్యులుగా ఉండాలని సూచించింది.మొత్తం సమాజం ఎలా అభివృద్ధి చెందాలి, కొత్త నిబంధనల తర్వాత క్యాంపస్ బయట వ్యక్తులు ఎలా మసులుకుంటున్నారు అనే పలు అంశాలపై లోతైన పరిశోధన చేసేలా ఉండాలని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సాల్సిటర్ జనరల్‌కు సూచించింది.

పిటిషనర్ల వాదనలు:

పిటిషనర్ల తరపున అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ వాదనలు వినిపించారు. కుల ఆధారిత వివక్ష అంటే ఏమిటో రెగ్యులేషన్‌లోని 3(1)(C) వివరిస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.దీని ప్రకారం ఎస్సీ,ఎస్టీ,ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి మాత్రమే రక్షణ కల్పించేలా ఉందని వాదించారు. అలాంటప్పుడు జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు వివక్షకు గురైతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వారికోసం ఎలాంటి సెక్షన్లు చేర్చలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే వివక్షను వివరిస్తూ సెక్షన్ 3e ఉండగా మళ్లీ కొత్తగా 3C ఎందుకని ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు అర్థం లేకుండా పోతుందని..ఇది పరిగణలోకి తీసుకుని కొత్త నిబంధనలపై స్టే విధించాలని న్యాయస్థానాన్ని కోరారు.

వివాదానికి కారణం ఏంటి?

రోహిత్ వేముల, పాయల్ తద్వి వంటి విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో.. క్యాంపస్‌లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ,మహిళల రక్షణ కోసం యూజీసీ ఈ కొత్త రూల్స్ తెచ్చింది. ఇందులో ప్రధానంగా..

1. ఈక్విటీ కమిటీలు: ప్రతి కాలేజీలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సభ్యులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయడం.

2. కఠిన శిక్షలు: నిబంధనలు పాటించని కాలేజీల గుర్తింపు రద్దు చేయడం లేదా నిధులు నిలిపివేయడం.

అయితే, ఈ నిబంధనల వల్ల జనరల్ కేటగిరీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, తప్పుడు ఫిర్యాదులతో వారిని వేధించే అవకాశం ఉందని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

తెలంగాణ, ఏపీపై ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు ఇప్పటికే ఈ కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఇప్పుడు ఆ ప్రక్రియ నిలిచిపోనుంది. రోహిత్ వేముల ఉదంతం జరిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి చోట్ల ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అణగారిన వర్గాల విద్యార్థులు ఈ స్టే పట్ల అసహనం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు విద్యార్థులు వివక్ష లేని క్యాంపస్ కావాలని కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+