యూనివర్శిటీల్లో కుల వివక్షపై యూజీసీ పోరు-కొత్త చట్టంపై వివాదమేంటి?

దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలో ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో సామాజిక న్యాయం, విద్యార్దుల మధ్య సమానత్వం కోసం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పటికే కొన్ని వర్గాల విద్యార్ధులకు అందుతున్న రక్షణలను అత్యంత వెనుకబడిన వర్గాలకు అందించడమే దీని వెనుక ఉద్దేశం. అయితే దీనిపై అగ్రకులాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో యూజీసీ తాజాగా దీనిపై వివరణ ఇచ్చింది.

ఓబీసీలకు యూజీసీ భరోసా

దేశంలో మేటి గ్రాడ్యుయేట్లను తయారు చేసే ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో విద్యార్ధుల మధ్య సామాజిక న్యాయం, సమానత్వం, న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తాజాగా కొన్ని నిబంధనల్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న రక్షణలను ఓబీసీ విద్యార్ధులకు కూడా వర్తింపచేసేలా ఈ నిబంధనలు ఉన్నాయి. తద్వారా తద్వారా ఇతర వర్గాల విద్యార్ధులతో సమానంగా వారు కూడా అన్ని విషయాల్లోనూ సమన్యాయం, ప్రాతినిధ్యం పొందే అవకాశం ఉందని యూజీసీ చెబుతోంది.

UGC Rolls Out New OBC Equality Regulation Sparks Opposition from Brahmin Mahasabha

కొత్తగా మారేదేంటి ?

క్యాంపస్‌లలో కుల ఆధారిత వివక్షను అరికట్టడం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి సురక్షితమైన, గౌరవప్రదమైన, సమ్మిళిత విద్యా వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా సమాన ప్రాతినిధ్య కేంద్రాల్ని ఏర్పాటు చేస్తారు. అలాగే యూనివర్సిటీ స్దాయిలో వీసీ ఆధ్వర్యంలో సమానత్వ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో విద్యార్దులు, అధ్యాపకులతో పాటు పౌరసమాజ సభ్యుల్ని కూడా భాగస్వాముల్ని చేస్తారు. ఈ కమిటీల్లో రిజర్వుడ్ కేటగిరీల ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలి. క్యాంపస్ లలో ఏదైనా సమస్య వస్తే ఈ కమిటీలు వెబ్ సైట్, ఈ మెయిల్, హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తాయి.24 గంటల్లో సమావేశం అయి చర్చించడంతో పాటు 15 రోజుల్లోపు పరిష్కరిస్తాయి. అలాగే యూజీసీకి ఆరునెలలకోసారి వీటిపై నివేదికలు కూడా ఇస్తాయి. అనంతరం 7 రోజుల్లో బాధ్యులపై వీసీలు చర్యలు తీసుకుంటారు.

ఇదంతా ఎందుకు ?

ఉన్నత విద్యలో కుల వివక్ష ఫిర్యాదులు 2019-20లో 173 నుండి 2023-24లో 378కి పెరిగాయి. అంటే ఏకంగా 118% పెరుగుదల నమోదైంది. మొత్తం 704 విశ్వవిద్యాలయాలు, 1,553 కళాశాలల్లో 1,160 ఫిర్యాదులు వచ్చాయి. విద్యార్దుల్లో పెరిగిన అవగాహనే ఇందుకు కారణంగా యూజీసీ భావిస్తోంది. అయితే ఈ ఫిర్యాదుల పరిష్కారం 90 శాతం జరుగుతున్నా, ఇంకా పెండింగ్ ఫిర్యాదులు ఉంటూనే ఉన్నాయి. దీంతో ఈ కమిటీలను మరింత బలోపేతం చేసేందుకు యూజీసీ ప్రయత్నిస్తోంది. తద్వారా వర్సిటీల్లో కులవిపక్షను రూపుమాపడంతో పాటు విద్యార్దుల మధ్య సమానత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

యూజీసీ చర్యపై వివాదాలు, వ్యతిరేకత

యూజీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాజస్తాన్ లో కర్ణి సేన, కాయస్థ మహాసభ వంటి అగ్ర కుల సమూహాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా సవర్ణ సమాజ్ సమన్వయ కమిటీ పేరుతో ఓ కొత్త సంస్ధను కూడా ఏర్పాటు చేసి నిరసనలు చేపడుుతున్నాయి. అలాగే ఉత్తర్ ప్రదేశ్ లో యతి నరసింహానంద్ యూజీసీ రూల్స్ కు వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. జనరల్ కేటగిరీ సభ్యులపై తప్పుడు ఆరోపణలకు ఈ చర్యలు కారణమవుతాయని, అంతిమంగా దుర్వినియోగం అవుతాయని వీరంతా వాదిస్తున్నాయి. అలాగే అధికార బీజేపీలోనూ ఈ వ్యవహారం తీవ్ర చర్చకు కారణమవుతోంది. అటు సోషల్ మీడియాలో సైతం అగ్రకుల వ్యతిరేక నిర్ణయంగా దీనిపై ప్రచారం జరుగుతోంది.

UGC Rolls Out New OBC Equality Regulation Sparks Opposition from Brahmin Mahasabha

ప్రభుత్వం ఏం చెబుతోంది ?

యూజీసీ తమ కొత్త నిబంధనల్ని సమర్ధించుకుంటోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఉన్నత విద్యా సంస్దల్లో కుల వివక్ష నిర్మూలన కోసం ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెబుతోంది. అగ్రకుల సంఘాలు వాదిస్తున్నట్లుగా ఈ నిబంధనలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తోంది. గతంలో ఉన్న బలహీనమైన నిబంధనల స్ధానంలో తాజా రూల్స్ పక్కాగా అమలు చేస్తామని యూజీసీ హామీ ఇస్తోంది. జనవరి 13 నుండి అమల్లోకి వచ్చిన ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వం, నియంత్రణపై వైరల్ అవుతున్న తప్పుడు సమాచారంపై కేంద్రం మండిపడుతోంది. తప్పుడు కథనాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తుందని అధికారులు తెలిపారు. నిబంధనల దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని వారు చెప్తున్నారు. యూజీసీ చట్టం 2026 సామాజిక న్యాయం కోసం డిమాండ్లు, అతివ్యాప్తి భయాల నేపథ్యంలో ఈ ఘర్షణ పెరిగేలా కనిపిస్తోంది. క్యాంపస్‌లను మరింత కలుపుకొని పోవడంలో నిబంధనలు విజయవంతమవుతాయా లేదా వివాదంలో చిక్కుకున్నాయా అనేది అవి క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయబడతాయి, సంస్థలు జవాబుదారీతనంతో న్యాయాన్ని ఎలా సమతుల్యం చేస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+