Modi Range Rover: మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్! ప్రధాని కాన్వాయ్‌లో 'మహా బలిష్ఠుడు'
దేశ ప్రధాని భద్రత అంటే సాధారణ విషయం కాదు. నిరంతరం కంటికి రెప్పలా కాపాడే ఎస్పీజీ బలగాలతో పాటు, ఆయన ప్రయాణించే వాహనం కూడా అత్యంత పటిష్ఠంగా ఉండాలి. అందుకోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో సరికొత్త 'రేంజ్ రోవర్ సెంటినెల్' (Range Rover Sentinel) చేరింది. ప్రధాని రక్షణ కోసం ఈ లగ్జరీ కమ్ బుల్లెట్ ప్రూఫ్ మోన్‌స్టర్‌ను ఎస్పీజీ రంగానికి దించుతుంది. రోడ్డుపై గంభీరంగా దూసుకెళ్లే ఈ ఎస్‌యూవీ (SUV) కేవలం చూడటానికే కాదు.. ఇంజినీరింగ్ పరంగా, భద్రత పరంగా నూటికి నూరు శాతం అభేద్యమైనది.
ఆ కవచాన్ని ఛేదించడం అసాధ్యం..
ఈ రేంజ్ రోవర్ సెంటినెల్ కారును విదేశీ నిపుణులు ఒక కదిలే కోటలా డిజైన్ చేశారు. దీనికి ప్రపంచంలోనే అత్యుత్తమమైన 'VR8-స్థాయి' బాలిస్టిక్ సర్టిఫికేషన్ ఉంది. అంటే శత్రువులు అత్యంత ప్రమాదకరమైన 7.62 ఎమ్ఎమ్ ఆర్ armor-piercing (ఉక్కు కవచాలను చీల్చే) తుపాకీ గుళ్లతో దాడి చేసినా, ఈ కారు బాడీని కానీ, అద్దాలను కానీ ఏమీ చేయలేవు.

కేవలం గుళ్లే కాదు.. బాంబు దాడులను కూడా ఇది తట్టుకోగలదు. కారు పక్కన ఏకంగా 15 కేజీల టీఎన్‌టీ (TNT) శక్తి కలిగిన పేలుడు సంభవించినా లోపల ఉన్నవారికి చిన్న గీత కూడా పడదు. కారు పైభాగం నుంచి లేదా కింద చేజ్ వైపు నుంచి గ్రెనేడ్లతో విరుచుకుపడినా ఇది సులభంగా తట్టుకుంటుంది. ఒకవేళ బయట దట్టమైన పొగ లేదా విషవాయువులు (గ్యాస్ ఎటాక్) వ్యాపిస్తే, లోపల ఉన్నవారికి ఊపిరి ఆడటానికి కారులోనే ప్రత్యేకంగా ఒక ఆక్సిజన్ సిలిండర్ వ్యవస్థను అమర్చారు. అలాగే అగ్నిప్రమాదాలు జరిగితే ఆటోమేటిక్‌గా మంటలను ఆర్పేసే ఫైర్ సిస్టమ్, అత్యవసర సమయాల్లో బయటి వారితో మాట్లాడటానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఇందులో ఉన్నాయి.
టన్నుల బరువు.. అయినా రాకెట్‌లా దూసుకెళ్తుంది
భారీ భద్రతా కవచాలు, బుల్లెట్ ప్రూఫ్ ప్లేట్ల కారణంగా ఈ కారు బరువు అక్షరాలా 4.4 టన్నుల (4,400 కేజీలకు పైగా) బరువెక్కింది. అంత బరువు ఉన్నప్పటికీ వేగంలో ఇది ఏమాత్రం తగ్గదు. దీని గుండెకాయ లాంటి ఇంజన్ రూమ్‌లో 5.0 లీటర్ సూపర్ ఛార్జ్డ్ V8 ఇంజన్‌ను అమర్చారు. ఇది 380 హార్స్ పవర్‌తో దూసుకెళ్తుంది. విపత్కర పరిస్థితులు ఎదురైతే శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇది కేవలం 10.4 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 193 కిలోమీటర్లు.
బయట యుద్ధరంగం.. లోపల రాజభోగం..
ఈ కారు బయట ఎంత గంభీరంగా, బలిష్ఠంగా ఉంటుందో.. లోపల మాత్రం అంతకంటే విలాసవంతంగా ఉంటుంది. ప్రధాని అధికారిక పర్యటనలు, సుదీర్ఘ ప్రయాణాల్లో ఎలాంటి అలసట లేకుండా ప్రశాంతంగా గడిపేందుకు అనువుగా అంతర్గత రూపాన్ని డిజైన్ చేశారు.
ల్యాండ్ రోవర్ సంస్థకు చెందిన ప్రత్యేక 'టచ్ ప్రో డుయో' ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. కారు లోపల రెండు 10-ఇంచుల హై-రెజల్యూషన్ టచ్ స్క్రీన్లు ఉంటాయి. వీటి ద్వారా నావిగేషన్, క్లైమేట్ కంట్రోల్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను సీట్లో కూర్చునే సులభంగా ఆపరేట్ చేయవచ్చు. విపరీతమైన ఒత్తిడి ఉండే పరిస్థితుల్లో సైతం ప్రధానికి పూర్తి సౌకర్యాన్ని అందించేలా ఈ సరికొత్త సెంటినెల్ వాహనాన్ని రూపొందించారు.














Click it and Unblock the Notifications