సీఎం రేవంత్ హెచ్చరిక, గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దు..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ నాయకులు హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదని హెచ్చరించారు. వచ్చే పది రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో ఆయా నియోజకవర్గాల్లో పర్యటించాలని హుకుం జారీ చేశారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని ఆదేశించారు. పదవుల కోసం పైరవీలు చేసే వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దని సూచించారు.
సీఎం రేవంత్ పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. నాయకులు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. రేపు (సోమవారం) నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీభవన్‌కు రావొద్దని ఆదేశించారు. పార్టీ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కొందరు నాయకులు హైదరాబాద్‌లో కూర్చొని ఎందుకు పనిచేయట్లేదని ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిని ఒక అవకాశంగా తీసుకోవాలని నిర్దేశించారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌పై 489 సమావేశాలు జరిగాయని తెలిపారు. బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా నేతలు స్పందించాలని ఆదేశించారు.

ఇంఛార్జ్ మంత్రులకు రేవంత్ ఆదేశాలు
ఇక నుంచి పది మంది ఇన్‌చార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్‌ఐఆర్‌పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని ఆదేశించారు. ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పార్టీపరంగా ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్‌ఐఆర్‌కు నియమించిన పార్టీ ఇన్‌చార్జ్‌లు క్షేత్రస్థాయిలో పర్యటించా ల్సిందేనని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌ను ఇన్‌చార్జ్ మంత్రులు పూర్తి పర్యవేక్షించాల్సిందేనని, అన్నింటికీ వారిదే బాధ్యత అని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు నాలుగు నియోజకవర్గాల్లో అసలే పనిచేయట్లేదని రిపోర్ట్ వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహుదూర్‌పూర్ నియోజకవర్గాల్లో అసలు పనిచేయడం లేదని ముఖ్యమంత్రి సీరియస్అయ్యారు.












Click it and Unblock the Notifications