2029 ఎన్నికలకు తొలి అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్, ఆ నియోజకవర్గాల్లోనూ...!!
ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి నుంచే కూటమి వర్సస్ వైసీపీ 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. స్థానిక ఎన్నికల వేళ సమీకరణాలు మారుతున్నాయి. కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మాజీ సీఎం జగన్ సైతం స్థానిక ఎన్నికల పైన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కాగా.. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితుల పైన జగన్ నివేదికలు తెప్పించుకుంటున్నారు. అందులో భాగంగా ప్రధాన నియోజకవర్గంలో పార్టీ తరపున కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటింది. కానీ, రాజకీయం మాత్రం 2029 ఎన్నికలే లక్ష్యంగా నడుస్తోంది. అటు కూటమి ప్రభుత్వం లోని ముఖ్య నేతలు ప్రతీ సభలోనూ వైసీపీ ని టార్గెట్ చేస్తూ విమర్శలు కొనసాగిస్తోంది. మరోసారి వైసీపీకి అవకాశం ఇవ్వద్దని ప్రజలను నేతలు కోరుతున్నారు. అటు జగన్ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతూ వస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ ఎన్నిక జరిగే ప్రతీ వార్డు.. ప్రతీ మున్సిపాల్టీలో పార్టీ అభ్యర్ధి బరిలో ఉండాల్సిందేనని.. ఇందుకు అక్కడి నియోజక వర్గ ఇంఛార్జ్ బాధ్యత తీసుకోవాలని జగన్ స్పష్టం చేసారు. కాగా.. నియోజకవర్గాల వారీగా సమస్య లు ఉన్న చోట జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు.

గూడూరు కు కొత్త ఇంఛార్జ్ నియామకం
తాజాగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా జగన్ కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇంఛార్జ్ గా బూదూరు గురవయ్యను నియమించారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధిగా మేరుగ మురళీ పోటీ చేసి ఓడిపోయారు. గూడూరు రూరల్ ఎంపీపీగా గురవయ్యగా పని చేసారు. నెల్లూరు జిల్లా తొలి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉంది. అలాంటి జిల్లాలో 2024 ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో.. జిల్లాలో నియోజకవర్గాల వారీగా పరిస్థితి పైన నివేదికలు తెప్పించుకుంటున్న జగన్ అవసరమైన మార్పులు - చేర్పుల కోసం సిద్దం అవుతున్నారు. ముందుగా గూడూరు ఇంఛార్జ్ పైన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే నెల్లూరు తో పాటుగా ప్రకాశం ఉమ్మడి జిల్లాల్లో పలు మార్పులు ఉంటాయని తెలుస్తోంది. దశల వారీగా జగన్ కొత్త ఇంఛార్జ్ ల పైన నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications