నర్సాపురం- అరుణాచలం మధ్య మరో కొత్త ఎక్స్ ప్రెస్ రైలు : రూట్..టైమింగ్స్..!!
ఏపీ నుంచి అరుణాచలంకు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ బిగ్ అప్డేట్. తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్లే వారి భారీగా పెరుగుతోంది. సెలవులు, పౌర్ణమి వేళ, ప్రత్యేక పర్విదినాల సమయం లో పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలం వెళ్తున్నారు. దీంతో, రైల్వే శాఖ సైతం వీరి కోసం ప్రత్యేకంగా అరుణాచలంకు స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతోంది. అదే విధంగా ప్రయాణీకుల డిమాండ్ మేరకు ఏపీ నుంచి అరుణాచలం కు మరో ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు నడిచే టైమ్సింగ్.. రూట్.. ఆగే స్టేషన్ల వివరాలను అధికారులు వెల్లడించారు.
అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే శాఖ మరో కీలక అప్డేట్ అందించింది. సెలవుల వేళ అరుణా చలం కు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. దసరా, దీపావళి వేళ ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో అరుణాచలం వెళ్తూ ఉంటారు. ఇప్పటికే ఏపీ మీదుగా అరుణాచలం కు పలు రైళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా నరసాపురం టు తిరువణ్ణామలై (07291/97292) ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ప్రకటించింది. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 30 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలుకు వెంటనే రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. నరసాపురం టు తిరువణ్ణామలై (07291) రైలు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంది. ఇది నర్సాపురంలో మధ్యాహ్నం ఒంటి గంటలకు బయల్దేరి తిరువణ్ణామలైకు సోమవారం ఉదయం 4.55 గంటలకు చేరుకుంటుంది.

రైల్వే శాఖ తాజా నిర్ణయంతో
అదే విధంగా తిరుగు ప్రయాణంలో తిరువణ్ణామలై-నర్సాపురం (07292) స్పెషల్ ట్రైన్ ప్రతీ సోమవారం రాత్రి 8 గంటలకు బయల్దేరి మంగళవారం ఉదయం 10.45 గంటలకు చేరుకుంటుందని అధికారులు వివరించారు. ఇక.. ఈ రైలు కొనసాగే మార్గంను అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఏసీ, స్లీపర్ కోచ్‌లతో పాటు జనరల్ కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక..కార్తీక మాసం ఆరంభం అయితే అరుణాచలం కు వెళ్లే భక్తుల సంఖ్య మరింతగా పెరగనుంది. దీంతో.. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్ల ఏర్పాటు పైన నిర్ణయం తీసుకుంటామని రైల్వే అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
