కేంద్రం గుడ్ న్యూస్ - అమరావతి కేంద్రంగా ఇమ్మిగ్రేషన్ కార్యాలయం..!!

అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయం వెలువడింది. అమరావతిలో ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (FRRO)ను ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విదేశీయుల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అమరావతి కేంద్రంగా ప్రత్యేక FRRO అధికారి నియమితులయ్యారు. అమరావతికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రం అమరావతికి తీపి కబురు చెప్పింది. రాజధాని అమరావతి కేంద్రంగా ఇమ్మిగ్రేషన్ కార్యాలయం అందుబాటులోకి రానుంది. గతంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు హైదరాబాద్‌లోని FRRO పరిధిలో ఉండగా, తాజా మార్పుతో ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి కేంద్రంగా ప్రత్యేక అధికారి వ్యవస్థను ఏర్పాటు చేశారు. FRRO వ్యవస్థ ద్వారా భారత్‌లో నివసిస్తున్న విదేశీయులకు రిజిస్ట్రేషన్, వీసా సంబంధిత సేవలు, రెసిడెన్షియల్ పర్మిట్ తదితర ఇమ్మిగ్రేషన్ సేవలు అందుతాయి. ప్రస్తుతం e-FRRO విధానం ద్వారా విదేశీయులు పలు సేవలను ఆన్‌లైన్‌లో పొందే అవకాశం ఉంది. అమరావతిలో ప్రత్యేక FRRO అధికారి నియామకం కావడంతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఇమ్మిగ్రేషన్, విదేశీయుల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు స్థానికంగా ప్రత్యేక అధికార పరిధి ఏర్పడనుంది.

 కేబినెట్ భేటీ: కొత్త పెన్షన్ల కు ఆమోదం, ముందుగా వారికే - స్థానిక ఎన్నికల్లో ఇలా..!!
కేబినెట్ భేటీ: కొత్త పెన్షన్ల కు ఆమోదం, ముందుగా వారికే - స్థానిక ఎన్నికల్లో ఇలా..!!
capital-amaravati-to-get-frro-office-as-centre-issues-gazette-notification-here-the-details

అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు

అదే విధంగా అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విదేశీ సందర్శకులు, పెట్టుబడిదారులు, నిపుణులు, సంస్థల ప్రతినిధుల రాకపోకలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలను సమన్వయం చేయడంలో ఈ వ్యవస్థ కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ కేంద్రం ద్వారా విదేశీ పౌరుల రిజిస్ట్రేషన్, వీసా పొడిగింపు, నివాస అనుమతులు, ఎగ్జిట్ పర్మిట్లు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) ధ్రువీకరణల వంటి కీలక సేవలు స్థానికంగానే వేగంగా పరిష్కారం కానున్నాయి. గతంలో వీటి కోసం హైదరాబాద్ లేదా చెన్నై కార్యాలయాలపై ఆధారపడాల్సి రాగా, అమరావతిలోనే ఈ వ్యవస్థ రూపుదిద్దుకోవడం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలకు అనుమతులు మరింత సులభతరం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+