Movie Tickets: ఏకంగా 570 శాతం పన్ను? ఈ సినిమాలకు మాత్రం జీరో ట్యాక్స్

భారతీయ చలనచిత్ర రంగానికి రాజధానిగా విరాజిల్లుతున్న ముంబై నగరంలో.. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులకు గట్టి షాక్ తగలనుంది. ఇకపై ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్లాలన్నా, వీకెండ్‌లో లైవ్ కాన్సర్ట్‌లు, డ్రామా షోలకు వెళ్లాలన్నా జేబులు ఖాళీ కాక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

నగరంలోని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, ఇతర వినోద వేదికలపై వసూలు చేసే ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్‌ను భారీగా పెంచాలని బాంబే మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సంచలన ప్రతిపాదన సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే టికెట్ ధరలు అమాంతం ఆకాశాన్ని తాకనున్నాయి.

BMC Entertainment Tax Hike Proposal AC Multiplex Tickets to Face Heavy Tax Burden in Mumbai

బీఎంసీ ప్రతిపాదించిన కొత్త రేట్ల ప్రకారం పన్ను వాతలు అత్యంత తీవ్రంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏసీ సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లలో ఒక టికెట్‌పై ఉన్న రూ. 60 పన్నును ఏకంగా రూ. 400 కి పెంచాలని నిర్ణయించారు. అంటే దాదాపు 570 శాతం మేర పన్ను పెరగనుంది. ఇక నాన్-ఏసీ థియేటర్ల విషయానికి వస్తే రూ. 45 ఉన్న పన్నును రూ. 200 కి (400% పెంపు) పెంచేందుకు ప్రతిపాదించారు.

'ది ప్యారడైజ్' మూవీకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ ధరలు పెంపు..
'ది ప్యారడైజ్' మూవీకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ ధరలు పెంపు..

నాటకాలు, సంగీత కాన్సర్ట్‌ల టికెట్లపై పన్నును రూ. 50 నుంచి రూ. 100 కి, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ షోల పన్నును రూ. 25 రూ. 75 కి పెంచాలని భావిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు పన్ను పరిధిలోకి రాని వీడియోగ్రాఫ్ ప్రదర్శించే మినీ థియేటర్లపై కూడా టికెట్‌కు రూ. 90 చొప్పున కొత్త పన్ను విధించే యోచనలో బిఎంసి ఉంది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా చూసేందుకు పర్మిషన్ ఇవ్వండి.. సీఎం రేవంత్ కు హీరో నాని రిక్వెస్ట్..
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా చూసేందుకు పర్మిషన్ ఇవ్వండి.. సీఎం రేవంత్ కు హీరో నాని రిక్వెస్ట్..

మరాఠీ, గుజరాతీ చిత్రాలకు బిగ్ రిలీఫ్..

ఒకవైపు పన్ను మోత మోగిస్తూనే ప్రాంతీయ సంస్కృతి, కళలను ప్రోత్సహించేందుకు బీఎంసీ ఒక కీలక సడలింపు ఇచ్చింది. మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలు, నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు ఈ ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ నుంచి 100 శాతం పూర్తి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే ఈ పన్ను సవరణల ప్రతిపాదనలు తక్షణమే అమలులోకి రావు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఈ ప్రతిపాదనలను పరిశీలించి ఆమోద ముద్ర వేసి, అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు ప్రస్తుతం ఉన్న 2014-15 పాత రేట్లే కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+