మహేష్ బాబు 'వారణాసి' షూటింగ్ పూర్తి.. టీజర్ ఎప్పుడంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా మహేష్ బాబు షూటింగ్ పూర్తయింది. రాజమౌళి ఏ సినిమాకు లేనంత జెట్ స్పీడులో ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తుండటం విశేషం. ఇన్నాళ్లూ రాజమౌళి టేకింగ్ పై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వచ్చేవి. ఆయనతో సినిమా అంటే ఎంత లేదన్నా నాలుగేళ్లు పడుతుంది అని లెక్కలేసుకునేవాళ్లు కానీ ఈ సారి మాత్రం రాజమౌళి అందరికీ షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు.

అనుకున్న సమయానికే షూటింగ్ ను పూర్తి చేసి ఆశ్చర్య పరిచారు. రాజమౌళి సినిమా అంటేనే ఫుల్ డీటెయిలింగ్, లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్, కళ్లు చెదిరే విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వాటన్నింటినీ కవర్ చేస్తూ దర్శకధీరుడు ఈ రేంజ్ అవుట్ పుట్ ను ఇంత తక్కువ సమయంలో తీసుకురావడం నిజంగా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇక ప్రీ ప్రొడక్షన్, వీఎఫ్ ఎక్స్ పనులకు తగినంత సమయం దొరికినట్లు సమాచారం. వారణాసి మూవీని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అందుకు తగిన విధంగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచకా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంటోంది.

Varanasi movie Big update on the actor Mahesh Babu has wrapped up shooting when the teaser coming

అటు మహేష్ బాబు సైతం రాజమౌళికు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. అందుకే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తయింది. ఇక ఈ ఏడాది దీపావళి పండగ కానుకగా వారణాసి టీమ్ ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమంలోనే వారణాసి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతేడాది నవంబర్ లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ ఏడాది నవంబర్ లో దీపావళి కానుకగా టీజర్ ను విడుదల చేయాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కానీ నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. ఇక మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మందాకిని అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే మలయాళం స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో అలరించనున్నారు. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ట్రూ ఐమాక్స్ ఫార్మాట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 120 కు పైగా దేశాల్లో రిలీజ్ కానుండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+