భారత్ లోనే ఐపీఎల్ ఆక్షన్: వెన్యూ ఖరార్ చేసిన బీసీసీఐ: మొహసిన్ నఖ్వీ వివాదంపై..

బీసీసీఐ పలు కీలక నిర్ణయాలను వెల్లడించింది. ఈ ఏడాది ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలాన్ని గోవాలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇదివరకు సౌదీ అరేబియా, దుబాయ్, అబుధాబి వంటి ప్రముఖ విదేశీ వేదికల్లో ఈ వేలాన్ని విజయవంతంగా నిర్వహించింది బీసీసీఐ. ఈ సారి ఎటూ వెళ్లట్లేదు. స్వదేశంలోనే ఈ మెగా వేలం పాటను నిర్వహించబోతోంది. ఈ డిసెంబర్ లో గోవాలో దీన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వెల్లడించింది.

బీసీసీఐ అధికార ప్రతినిధి దేవజిత్ సైకియా.. ఈ వివరాలను వెల్లడించారు. గువాహటిలో ఆయన ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఐపీఎల్ వెన్యూ, భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నగోయా ఆసియా గేమ్స్ లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం సాధించడం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోందని, జాతి మొత్తం ఎంతో గర్విస్తోందని, వారి ఆటతీరు అద్వితీయమని సైకియా కొనియాడారు.

BCCI Announces IPL Auction to Be Held in Goa This December and refused to comments on Mohsin Naqvi

గత ఏడాది నవంబర్ 3న ముంబైలో వన్డే ఐసీసీ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించినప్పటి నుంచి భారత మహిళల జట్టు అప్రతిహత విజయ పరంపరను కొనసాగిస్తోందని గుర్తుచేశారు. ఈ చారిత్రాత్మక ప్రదర్శనకు అద్భుత సారథ్యం వహించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానలతో పాటు జట్టులోని ప్రతి క్రీడాకారిణిని అభినందించారు. జట్టు సాధిస్తున్న ఈ సుదీర్ఘ విజయాల వెనుక హెడ్ కోచ్ అమోల్ ముజుందార్, సపోర్టింగ స్టాఫ్ అంకితభావం ఉందని కితాబిచ్చారు.

వారసుడిని ప్రకటించిన మాయావతి
వారసుడిని ప్రకటించిన మాయావతి

మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని అందుకోవడానికి భారత్ నిరాకరించిందనే వివాదంపై సైకియా స్పందించారు. ఈ వ్యవహారంపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయదలచుకోలేదని వ్యాఖ్యానించారు. మ్యాచ్ లల్లో క్రీడాకారులు కనబరుస్తోన్న అత్యుత్తమ ప్రదర్శనలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఆసియాలోనే కాకుండా ఇతర బలమైన జట్లపై భారత్ సాధించిన విజయాలను సైకియా ప్రస్తావించారు.

టీ20ల్లో టీమిండియా రేర్ ఫీట్: మొట్టమొదటి జట్టు మనదే బాస్
టీ20ల్లో టీమిండియా రేర్ ఫీట్: మొట్టమొదటి జట్టు మనదే బాస్

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా, ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై విజయ కేతనం ఎగురవేయడం జట్టు సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే లార్డ్స్ లో ఇంగ్లాండ్‌, ఆ తర్వాత దుబాయ్‌లో పాకిస్తాన్, శ్రీలంక జట్లను ఓడించి ఆసియా కప్ సొంతం చేసుకోవడం, తాజాగా ఆసియా గేమ్స్ ఫైనల్ లో శ్రీలంకను భారీ తేడాతో ఓడించి స్వర్ణం సాధించడం భారత క్రికెట్ సాధించిన గొప్ప మైలురాళ్లని వివరించారు.

ఎల్ నినో.. ఇంకా స్ట్రాంగ్ అయింది: ఈ ఆరు నెలల్లో మృత్యు తాండవం
ఎల్ నినో.. ఇంకా స్ట్రాంగ్ అయింది: ఈ ఆరు నెలల్లో మృత్యు తాండవం

ఆసియా గేమ్స్ లో భాగంగా జపాన్ తో జరిగిన మ్యాచ్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో దోహదపడుతుందని సైకియా అభిప్రాయపడ్డారు. ఐసీసీ చైర్మన్ జై షా ఎడిన్‌బర్గ్‌లో తీసుకున్న చొరవ మేరకు ఈ మ్యాచ్ కార్యరూపం దాల్చిందని అన్నారు. జపాన్ క్రికెట్ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరిపి మ్యాచ్ నిర్వహించడం ద్వారా ఆ దేశంలో క్రికెట్ ప్రాచుర్యం పెరగడానికి, ఆసియా పొరుగు దేశాలలో క్రీడ విస్తరణకు అవకాశం లభించినట్టయిందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+