Cyclone Arnab: ఏపీలో భారీ వర్షాలతో కంట్రోల్ రూమ్స్- నంబర్లు ఇవే..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా ఆర్ణబ్ తుఫాన్ గా (cyclone Arnab) మారి ఇవాళ రాత్రికి తీరం దాటబోతోంది. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లోని గోపాల్ పూర్ వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే కోస్తా జిల్లాల వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. రాత్రి తుఫాన్ తీరం దాటితే రేపు కూడా భారీ వర్షాలు తప్పవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది. తుపాన్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు ప్రజలు ఈ నంబర్లకు కాల్ చేయాలని సూచిస్తోంది.
ఏపీలో కంట్రోల్ రూమ్ ల నంబర్లు
విశాఖ జోన్-2 - 9849628880.
విశాఖ జోన్-3 - 9491030722.
అనకాపల్లి - 9490610023. కశింకోట - 8333810597.
నర్సీపట్నం - 9491030723.
పాడేరు - 9490610027.
కాకినాడ - 9490610856. పెద్దాపురం - 9493178728.
జగ్గంపేట - 9490610097. రాజమహేంద్రవరం టౌన్ - 9490610855.
రాజమహేంద్రవరం రూరల్ - 9490610859.
నిడదవోలు - 9493177540. అమలాపురం - 9490610101.
కొత్తపేట - 9493178821.
రంపచోడవరం - 8309771508.
ఏలూరు - 9440904037.
జంగారెడ్డిగూడెం - 9491030712.
భీమవరం - 9490610143.
తాడేపల్లిగూడెం - 9493177806.
నరసాపురం - 7382050943.
శ్రీకాకుళం- 9701400865. టెక్కలి - 9490610050.
పలాస - 08945241084. పాలకొండ - 8332843546.
పార్వతీపురం - 9398594750. విజయనగరం టౌన్ & రూరల్ - 9490610102.
బొబ్బిలి - 9490610121. విశాఖ జోన్-1- 9490610019.
టోల్ ఫ్రీ నెంబర్- 1912, కార్పొరేట్ ఆఫీస్- 8331018762.

ఏపీలో వాయుగుండంగా కనిపిస్తున్న ఈ తుపాన్ గత 6 గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో కదులుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ప్రస్తుతానికి గోపాల్‌పూర్‌కు 150 కి.మీ, కళింగపట్నానికి 50 కి.మీ, ఒడిశాలోని పూరీకి 250 కి.మీ, విశాఖపట్నానికి 120 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు వెల్లడించింది. ఇవాళ రాత్రికి ఇది తీవ్రవాయుగుండంగా మారి విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈరోజు రాత్రి, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. అలాగే ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతోంది.














Click it and Unblock the Notifications
