TTD: కొత్త సదుపాయాలు ప్రారంభం, అలిపిరి కేంద్రంగా ఇక - ఛైర్మన్ బీఆర్ నాయుడు..!!
తిరుమలలో భక్తులకు అందుతున్న సదుపాయాల పైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక అంశాలను వెల్లడించారు. సాలికట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణ గురించి పలు అంశాలను వివరించారు. 8 రోజుల్లో 5.76 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకోగా.. రూ 28.94 కోట్లు హుండీ కానుకలు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. గరుడసేవ రోజున భక్తులందరికీ దర్శనం కల్పించామని.. కొత్త సదుపాయాలు అందుబాటులోకి తేవటంతో పాటుగా భవిష్యత్ ప్రణాళికలు ఖరారు చేసినట్లు వెల్లడించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సెప్టెంబరు 15 నుంచి 22వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించినట్లు తెలిపారు. ఎనిమిది రోజుల బ్రహ్మోత్సవాల్లో మొత్తం 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 13,671 ట్రిప్పుల్లో 3,92,106 మంది, తిరుమల నుంచి తిరుపతికి 13,584 ట్రిప్పుల్లో 4,97,195 మంది భక్తులు ప్రయాణించారు. శ్రీవారి బ్రహ్మోత్సవా ల్లో అత్యంత ముఖ్యమైన గరుడసేవ రోజున తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ దర్శనం కల్పించామని చైర్మన్ తెలిపారు. శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, దుర్లభ్ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తుల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు.

భక్తుల కోసం కొత్తగా
అలాగే మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.90 కోట్లతో తిరుచానూరు ఆలయానికి ఉన్న రోడ్లను అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. అలిపిరి సమీపంలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 50 ఎకరాల్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తు న్నట్లు తెలిపారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు వృక్ష గోవిందం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. శ్రీవారి సేవ, శ్రీవారి వైద్యసేవలను మరిం త బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఉద్యోగుల హౌసింగ్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు రూ.230 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు సేవలందించేందుకు 4,000 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారు. భక్తుల ఆరోగ్య భద్రత కోసం 50 మంది వైద్యులు, 150 మంది పారామెడికల్ సిబ్బంది, 16 అంబులెన్సులు అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.













Click it and Unblock the Notifications
