రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి, డెడ్ లైన్..!!
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకున్న వేళ ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త నిర్ణయం అమలుకు సిద్దమైంది. ప్రస్తుత పరిస్థితులు మూడు నెలల రేషన్ బియ్యం ఒకే సారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రానున్న మూడు నెలల రేషన్ వచ్చే నెలలోనే ఇచ్చేలా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి ఈ కోటా పంపిణీకి సిద్దం అవుతోంది.
రేషన్ కార్డు దారుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులు.. వర్షాభావ పరిస్థితుల వేళ రేషన్ బియ్యం పంపిణీ పైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ అయ్యాయి. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో మరోసారి 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఆగస్టు 1 నుంచి మూడు నెలల బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న విధానం మేరకు ప్రతీ నెల తొలి 15 రోజులు మాత్రమే రేషన్ బియ్యం అందుబాటులో ఉంచుతున్నారు.

ఈ కేవైసీ తప్పనిసరి .. చివరి తేదీ
కాగా, ఇప్పుడు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో మూడు నెలల బియ్యం ఒకే విడతలో పంపిణీ కి వీలుగా ఆగస్టు నెల మొత్తం రేషన్ దుకణాలు తెరిచి ఉంచాలని స్పష్టం చేసారు. మూడు నెలల కోటా ఒకే సారి ఇస్తుండటంతో... లబ్దిదారులు సరకు తీసుకునే సమయంలో మూడు సార్లు వేలి ముద్రలు వేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేసారు. గత ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ సైతం ఇదే విధంగా పంపిణీ అయింది. ఇక.. ఇదే సమయంలో రేషన్ కార్డు దారులకు ఈ - కేవైసీ తప్పనిసరి చేసారు. వచ్చే నెల నుంచి వారికి మాత్రమే రేషన్ సరఫరా అయ్యేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇప్పటికీ ఈ కేవైసీ చేసుకోని వారికి ఈ నెల 31 తుది గడువుగా నిర్ణయించారు. కాగా.. ఎక్కడి నుంచి అయినా ఈ కేవైసీ అప్డేట్ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది.













Click it and Unblock the Notifications