హైదరాబాద్ లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ - సిగ్నల్ ఫ్రీ జర్నీ..!!
హైదరాబాద్ వాసులకు కీలక అప్డేట్. ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కేలా ప్రభుత్వం కొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. నగరంలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. నగరంలో అత్యధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో ఈ నిర్మాణానికి రంగం సిద్దం అయింది. ఈ ప్రాజెక్టు ద్వారా నాలుగు రోడ్ల కూడలిని పూర్తిగా సిగ్నల్ రహితంగా మారుస్తున్నారు. రూ.459 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు ఫ్లైఓవర్లు, ఒక అండర్ పాస్ అందుబాటులోకి రానున్నాయి.
దరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మొదలు కానుంది. తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా పిల్లర్ల పనులు వేగంగా పూర్తయ్యాయి. ప్రయాణికులకు ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం కలిగించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. మే 2027 నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు గడువు నిర్ణయించారు. ఐటీ ఉద్యోగులకు, స్థానికులకు నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారం కానుంది. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వరకు ప్రయాణం ఇకపై చాలా సులభతరం అవుతుంది. పూర్తి సాంకేతికతను వినియోగిస్తూ ఈ నిర్మాణం చేపట్టారు. ఐఎస్‌బీ రోడ్డు నుంచి డీఎల్‌ఎఫ్ వైపునకు 720 మీటర్ల పొడవుతో నాలుగు లైన్ల పైవంతెన నిర్మించాలని నిర్ణయించారు. దీనిపై రెండో అంతస్తులో లింగంపల్లి వైపు వెళ్లేందుకు 948 మీటర్ల పొడవున మూడు లైన్ల ఫ్లైఓవర్ ఉంటుంది.

హైదరాబాద్ లో ట్రాఫిక్ పరిష్కారం దిశగా
అదే విధంగా ఐఎస్‌బీ రోడ్డు నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు మరో 1.2 కిలోమీటర్ల రెండంతస్తుల నిర్మాణానికి ప్రణాళికలు ఖరారు చేసారు. గచ్చిబౌలి-లింగంపల్లి మధ్య 520 మీటర్ల భారీ అండర్ పాస్ పనులు కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం 15 నిమిషాల వరకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. వాహనదారులు ఎలాంటి సిగ్నల్స్ లేకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని వెల్లడించారు. దీంతో.. విప్రో సర్కిల్, కొండాపూర్ మార్గాల్లో ప్రయాణించే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ డిజైన్లను అత్యంత పకడ్బందీగా రూపొందించినట్లు వెల్లడించారు. ఐటీ హబ్‌లో ప్రయాణాన్ని వేగవంతం చేయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యంగా స్పష్టం చేసారు. అదే విధంగా ట్రిపుల్ ఐటీ జంక్షన్‌తో పాటు ఖాజాగూడ కూడలిలో కూడా భారీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications