యూనిఫైడ్ పెన్షన్ స్కీం, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్: కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మూడు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బయో ఈ-3 విధానంతోపాటు విజ్ఞాన్‌ ధార, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌నకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్రం యూనిఫైడ్‌ పింఛన్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. సుమారు 23 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారన్నారు. దీని కోసం రూ.10,579 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు. పారిశ్రామిక, ఐటీ విప్లవాల మాదిరిగా త్వరలో బయో విప్లవం రానుందని, దీంతో బయో టెక్నాలజీ, బయో సైన్స్‌ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలున్నాయి. దీని ద్వారా ఉద్యోగాల కల్పనే కాదు ఆర్ధికాభివృద్ది కూడా జరుగుతుందని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Unified Pension scheme internship for students These are the decisions of the central cabinet

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణలు, సాంకేతికత అభివృద్ధి వంటి విభాగాలను ప్రస్తుతం విజ్ఞాన్ ధార అనే ఏకీకృత స్కీమ్‌లో విలీనం చేశారు. సంబంధిత విభాగాలన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా సమర్థంగా నిధుల వినియోగం, ఉప పథకాలు/కార్యక్రమాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని కేంద్రం భావిస్తోంది.

కేబినెట్ భేటీకి సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడిస్తూ.. ఒకవేళ ఉద్యోగులు సర్వీసులో ఉండగా చనిపోతే వారి భార్యకు 60 శాతం పెన్షన్ ఇస్తారని చెప్పారు. ఎన్పీఎస్ పథకాన్ని మెరుగుపర్చాలని దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డిమాండ్ ఎప్పుట్నుంచో డిమాండ్ ఉందన్నారు.

2023 ఏప్రిల్‌‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంస్కరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కమిటీకి డాక్టర్ సోమనాథన్ అధ్యక్షుడిగా ఉన్నారని, ఈ కమిటీ 100కు ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలతో మాట్లాడిందని తెలిపారు. ఈ కమిటీ దాదాపు అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపిందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఈ అంశాన్ని ప్రధాని సీరియస్ గా తీసుకుని, కమిటీ సిఫారసు మేరకు సమీకృత పింఛను పథకాన్ని ప్రభుత్వం ఆమోదించిందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+