తగ్గనున్న మొబైల్.. స్మార్ట్ వాచీ, స్మార్ట్ బ్యాండ్స్..
మరో 4 రోజుల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-2023 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్ ఎలా ఉండబోతుంది. వడ్డీంపులు ఎవరికీ, రాయితీ ఎవరికీ అనే చర్చ జరుగుతుంది. సామాన్యుడు చూసేవి మాత్రం.. ఫోన్, టీవీ, ఇతర గృహ అవసరాలను మాత్రమే చూస్తారు. కరోనా వల్ల మధ్య తరగతి ప్రజలు ఏసీ కొనాలంటేనే జంకుతున్నారు. కొనుగోలు చేయడం లేదు. ఈ సారి హల్వా వండే ప్రక్రియ లేదు. స్వీట్‌తోనే పద్దును సిద్దం చేశారు. అయితే కేటాయింపులకు సంబంధించి కీలక విషయం తెలిసింది.
స్మార్ట్ ఫోన్.. ప్రతీ ఒక్కరీ నిత్యవసర వస్తువు అయిపోయింది. ఏ పని చేయాలన్న తప్పనిసరి. చివరికీ పిల్లలు ఆన్ లైన్ క్లాసులు కూడా దీనితోనే వింటున్నారు. విడి భాగాలు, ఇతర కారణాలు చూపి ఎప్పుడూ ధర పెంచేవారు. అయితే ఈ సారి మాత్రం ధర తగ్గుతుందట. సో మొబైల్ లవర్స్ ఏం చక్కా మొబైల్స్ కొనుగోలు చేయడానికి ట్రై చేయండి. ఈ సారి బడ్జెట్‌లో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ విడి భాగాల దిగుమతి సుంకం తగ్గించే అవకాశం ఉంది. దీంతోపాటు కస్టమ్స్ నిబంధనలనూ సరళీకరించొచ్చనే అంచనాలు ఉన్నాయి.

ఒక్క మొబైల్స్ కాదే.. స్మార్ట్ వాచీ, స్మార్ట్ బ్యాండ్స్ వంటి డివైజ్‌లకు సంబంధించిన విడి భాగాలపై సుంకాలను తగ్గించే ఛాన్స్ ఉంది. ఈ ప్రతిపాదన నిజమైతే మొబైల్ లవర్స్‌కు ఊరట కలుగనుంది. మొబైల్ విక్రయాలు మరింత ఎక్కువ జరగనున్నాయి. అలాగే సెకండ్ హ్యాండ్ మొబైళ్లకు కూడా మంచి డిమాండ్ ఉంది.












Click it and Unblock the Notifications