నిర్మలమ్మ చేతుల మీదుగా 'హల్వా' వేడుక.. దీని హిస్టరీ తెలుసా?
Budget 2026: దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026ను ఫిబ్రవరి 1వ తేదీన(ఆదివారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ పార్లమెంటుకు చేరడానికి కొన్ని రోజుల ముందే నార్త్ బ్లాక్‌లో ఓ సందడి కనిపిస్తుంది. అదే 'హల్వా వేడుక'. అసలు ఈ వేడుక ఎందుకు చేస్తారు? దీని ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఏమిటీ హల్వా వేడుక?
భారతీయ సంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. బడ్జెట్ తయారీ అనేది దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసే అతిపెద్ద ప్రక్రియ. ఈ బడ్జెట్ డాక్యుమెంట్ల తయారీ పూర్తయిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఓ పెద్ద కడాయిలో హల్వా తయారు చేస్తారు. ఆర్థిక మంత్రి స్వయంగా బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బందికి ఈ హల్వాను వడ్డిస్తారు.

75 ఏళ్లుగా మారని ఆనవాయితీ
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఈ హల్వా వేడుక నిరంతరాయంగా కొనసాగుతోంది. కేవలం 2022లో కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ దీనికి బదులు మిఠాయిలు పంచారు. మళ్లీ యథావిధిగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు.
బయటి ప్రపంచంతో సంబంధాలు కట్
హల్వా వేడుక ముగిసిన వెంటనే బడ్జెట్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది (సుమారు 100 మందికి పైగా) 'లాక్-ఇన్' పీరియడ్‌లోకి వెళ్తారు. బడ్జెట్ వివరాలు లీక్ కాకుండా ఉండేందుకు వీరంతా నార్త్ బ్లాక్‌లోని భూగర్భ ప్రింటింగ్ ప్రెస్ ఏరియాలోనే బస చేస్తారు. ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం ముగించే వరకు వీరు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండరు. ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుంది. కనీసం తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటానికి వీలుండదు.
బడ్జెట్ 2026 ప్రత్యేకతలు
సాధారణంగా పనిదినాల్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ, ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో సెలవు రోజున బడ్జెట్ రాబోతోంది. దీనిపై ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టత ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. హల్వా వేడుక అనేది కేవలం మిఠాయిలు పంచుకోవడం మాత్రమే కాదు, బడ్జెట్ వంటి అత్యంత రహస్యమైన డాక్యుమెంట్ తయారీలో రాత్రింబగళ్లు శ్రమించిన అధికారుల కృషిని గౌరవించే ఒక వేడుక.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications