ZPTC, MPTC స్థానాల్లో ఊహించని ఫలితాలు- సీన్ రివర్స్: పులివెందుల, గన్నవరం ఇలా..!!
ZPTC, MPTC ఓట్ల లెక్కింపులో ఊహించని ఫలితాలు బయటకు వస్తున్నాయి. కూటమి పలు ప్రాంతాల్లో ఆధిక్యత కొనసాగుతోంది. అయితే, మున్సిపల్ కంటే కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. వైసీపీ కంచుకోటల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా కూటమి విజయం సాధించింది. అయితే, ఇప్పుడు ఈ ఫలితాల్లో మార్పు కనిపిస్తోంది. వైసీపీ ముఖ్య నేతల నియోజకవర్గాల్లోనూ ఫలితాలు ఆసక్తిగా మారుతున్నాయి. దీంతో.. తుది ఫలితాల పైన ఉత్కంఠ పెరుగుతోంది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తి పెంచుతున్నాయి. పెద్ద సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు కూటమికి ఏకగ్రీవం అయ్యాయి. పోలింగ్ జరిగిన చోట ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కడప జిల్లాలో పోటీ మున్సిపల్ కంటే కొంత భిన్నంగా కనిపిస్తోంది. మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ టీడీపీ గెలిచింది. అయితే, అదే జిల్లాలోని
వేలపల్లి, వేముల, లింగాల జెడ్పీటీసీల్లో వైసీపీ ఆధిక్యత కొనసాగుతోంది. మైదుకూరు జడ్పీటీసీ టీడీపీ కైవసం చేసుకుంది. పులివెందులలో 1,463 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి భారతి విజయం సాధించగా.. మైదుకూరులో 18,903 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కృష్ణకిషోర్ గెలుపొందారు. విజయనగరంలో కూటమి- వైసీపీ మధ్య పోరు హోరా హోరీ పోరు కనిపిస్తోంది. నెల్లూరులోనూ వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతాల్లో టీడీపీ ఆధిక్యత కొనసాగుతోంది.

హోరా హోరీగా సాగుతున్నా.. కూటమికే ఆధిక్యత
కాగా, పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 65 ఎంపీటీసీ స్థానాల్లో 64 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. వేంపల్లి మండలం రెడ్డిపల్లి ఎంపీటీసీకి మాత్రమే ఎన్నిక జరిగింది. అలిరెడ్డిపల్లిలో కూడా 29 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. అటు.. బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి ఓబులమ్మ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 8391 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. అనంతపురంలో గట్టి పోటీ నెలకున్నా కూటమి ఆధిక్యత కొనసాగుతోంది. ఫలితాల ప్రకటనలో అక్రమాలు జరిగాయంటూ నగరి కౌంటర్ సెంటర్ వద్ద మాజీ మంత్రి రోజా ధర్నాకు దిగారు. జనసేన అభ్యర్ధులు పోటీ చేసిన మెజార్టీ స్థానాల్లో విజయం వైపు దూసుకెళ్తున్నారు. సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
