Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్ర బడ్జెట్: బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే..

బుధవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగియగానే పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: బుధవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగియగానే పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు. ఎవరెవరు ఏమేం అన్నారో వారి మాటల్లోనే...

కేంద్ర బడ్జెట్ 2017-18 - మరిన్ని కథనాలు

* ఇది షేర్-షాయరీల బడ్జెట్. రైతులు, యువతకు ఎలాంటి ఉపయోగం లేదు : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ

* రాజకీయ వ్యవస్థను శుభ్రం చేయడానికి ఇదొక మంచి నిర్ణయం. దీనిని మేం స్వాగతిస్తున్నాం : కేంద్ర మంత్రి అనంత్ కుమార్

* ఇది చారిత్రాత్మకం. ముఖ్యమైన బడ్జెట్. సుదీర్ఘకాలంలో దీని ప్రభావం కనిపిస్తుంది : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Union Budget: Who Said, What Said...

* రక్షణశాఖ నిధుల గురించి బడ్జెట్ లో ప్రస్తావించ లేదు. యూపీ ఎన్నికల్లో వాళ్లెలా పోరాడుతున్నారు? వాళ్లు విరాళాలు డిజిటల్ చెల్లింపులు, చెక్కుల ద్వారానే తీసుకున్నారా? : కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి

* కేంద్ర బడ్జెట్ చాలా బాగుంది. నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించారు : సోనాలి జైట్లీ ( అరుణ్ జైట్లీ కుమార్తె)

* ఈ బడ్జెట్ తో కొత్త యుగం ఆరంభమైనట్లే. మూస ధోరణిని బద్ధలు కొట్టిన బడ్జెట్ ఇది : రైల్వే మంత్రి సురేష్ ప్రభు

* బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి రైతులకు మూలధనంపై పన్ను మినహాయింపు ఇవ్వడం ఓ వరం. దీని వల్ల ఈ ప్రాంతంలోని 28 వేల మంది రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది : సీఆర్ డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్

* బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగింది. ఖజానాను నింపుకోవడంపైనే కేంద్రం దృష్టిపెట్టంది. జీ ఎస్ టీ ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పంచుకోవాలోవెల్లడించలేదు. అమరావతికి రైల్వే జోన్ ప్రస్తావనే లేదు. రైతులను నిరాశకు గురిచేసిన బడ్జెట్ ఇది : వైకాపా అధికార ప్రతినిధి పార్థసారథి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+