పంచపాండవులను టార్గెట్ చేసిన చాణిక్యుడు, ఏం చేస్తారో నాకు తెలీదు !
బెంగళూరు/మైసూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. తాను కింగ్ మేకర్ కావాలని జేడీఎస్ ప్రయత్నిస్తున్నది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు మందిని ఓడించాలని రాజకీయ చాణిక్యుడు అమిత్ షా లక్షంగా చేసుకున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలో ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇటీవల బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోయి కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదిని అమిత్ షా టార్గెట్ చేసుకున్నారని తెలిసింది. ముగ్గురు మాజీ సీఎంలు, సీఎం రేసులో ఉన్న మరో నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఓటమి కోసం బీజేపీ సెంకడ్ వన్, ఆ పార్టీ రాజకీయ చాణిక్యుడు రంగంలోకి దిగారు.

ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీజేపీలో ఉన్నత స్థానం కల్పించినా బీజేపీకి ద్రోహం చేసిన జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని అమిత్ షా రగిలిపోతున్నారని తెలిసింది. బీజేపీ హైకమాండ్ తో పాటు బీఎల్ సంతోష్ ను టార్గెట్ చేసుకుని బహిరంగంగా మాట్లాడిన జగదీష్ శెట్టర్ కు ఎలాగైనా ఓటమి రుచి చూపించాలని స్థానిక నాయకులకు అమిత్ షా సూచించారని తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేసిన బీజేపీ లక్ష్మణ సవది మోసం చేశాడని, రాజకీయ శత్రువు కాంగ్రెస్ తో చేతులు కలిపి ఇంతకాలం నమ్ముకున్న బీజేపీ కార్యకర్తలకు ద్రోహం చేసిన లక్ష్మణ సవదికి చుక్కలు చూపించి ఓడించాలని అమిత్ షా స్థానిక బీజేపీ నాయకులకు సూచించారని తెలిసింది.

మాజీ సీఎం సిద్దరామయ్యను ఆయన సొంత నియోజక వర్గం వరుణాలో కచ్చితంగా ఓడించాలని అమిత్ షా స్థానిక బీజేపీ నాయకులకు సూచించారు. వరుణా నియోజక వర్గంలోని బీజేపీ నాయకులతో ఇప్పటికే చర్చలు జరిపిన అమిత్ షా మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. సిద్దరాయయ్యను ఓడించి అక్కడ బీజేపీ నేత వి. సోమన్నను గెలిపించాలని అమిత్ షా సూచించారని సమాచారం.

కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ వస్తే సీఎం కావాలని ఆశపడుతున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ను ఓడించాలని ఇప్పటికే కనకపుర నియోజక వర్గం బీజేపీ నాయకులతో చర్చించిన అమిత్ షా ట్రబుల్ షూటర్ ను ఓడించడానికి అందరూ కలిసి పని చెయ్యాలని సూచించారని తెలిసింది.
జేడీఎస్ పార్టీ నుంచి ప్రతిసారి సీఎం అభ్యర్థిగా పోటీ పడుతూ ఇప్పటికే లక్కీ చాన్స్ కొట్టేసి ముఖ్యమంత్రిగా కొనసాగిన హెచ్.డీ. కుమారస్వామిని కూడా ఓడించాలని, రాజకీయ వారసత్వానికి చెక్ పెట్టేలా బీజేపీ నాయకులు ప్రయత్నించాలని అమిత్ షా చెన్నపట్టణ బీజేపీ నాయకుల దిశానిర్దేశం చేశారని తెలిసింది.
కర్ణాటకలోని మాజీ సీఎంలు సిద్దరామయ్య, జగదీష్ శెట్టర్, హెచ్.డీ. కుమారస్వామితో పాటు మాజీ మంత్రులు డీకే. శివకుమార్, లక్ష్మణ సవదిలను టార్గెట్ చేసుకుని పని చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద అమిత్ షా ఎత్తులు ఎంత వరకు ఫలిస్తాయో అనే విషయం మే 13వ తేదీన తేలిపోనుంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications