మాజీ సీఎంకు షాక్, రివర్స్ ఆపరేషన్ షురు, దెబ్బకు దెబ్బ తియ్యాలి, కులం ఓట్లతో !
బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పార్టీలు మారే నాయకుల జోరు ఎక్కువ అవుతోంది. మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ను దెబ్బ కొట్టడానికి బీజేపీ నాయకులు రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన వెంటనే హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం సీటు ఇచ్చేశారు. హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బసవరాజ్ మలకారి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ వేశారు.

బసవరాజ్ తో నామినేషన్ వితడ్రా చేయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. అయితే బసవరాజ్ మాత్రం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాట వినలేదు. ఇదే సమయంలో రంగంలోకి దిగిన బీజేపీ నాయకులు బసవరాజ్ ను బీజేపీలోకి చేర్చుకోవడంలో విజయం సాధించారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో బీజేపీలో చేరిన బసవరాజ్ బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బసవరాజ్ ను బీజేపీలో చేర్చుకున్న నాయకులు లింగాయత్ ఓట్లు చీల్చి జగదీష్ శెట్టర్ ను దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అమ్రత్ దేశాయ్ రాజీ చర్చలు మొదలుపెట్టి బసవరాజ్ ను బీజేపీలో చేర్చుకున్నారు.
మరో వైపు హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఓ మైనారిటీ నాయకుడు తాను పోటీలోనే ఉంటానని, జగదీష్ శెట్టర్ కు మద్దతు ప్రకటించమని తేల్చి చెప్పారు. బీజేపీ నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకున్న ఆ పార్టీ నాయకులను దెబ్బ కొట్టాలని ఇప్పుడు బీజేపీ నాయకులు రివర్స్ ఆపరేషన్ కమలను తెర మీదకు తీసుకురావడంతో కర్ణాటకలోని పలు నియోజక వర్గాల్లో అసెంబ్లీ ఎన్నిల పోరు రసవత్తరంగా మారిపోయింది.












Click it and Unblock the Notifications