కాలినడకనే తిరుమల కొండెక్కిన పవన్ కళ్యాణ్ భార్య అన్నా.. వీడియో వైరల్ !!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గం ద్వారా కాలినడకన బయలుదేరిన ఆమె.. మార్గం మధ్యలో మొక్కులు చెల్లించుకుంటూ తిరుమల కొండపైకి చేరుకున్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామి వారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించారు.

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని.. ఆయనకు శక్తి, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని కూడా ఆమె స్వామివారిని వేడుకున్నట్టు చెబుతున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు.

pawan-kalyan-wife-anna-lezhneva-visited-lord-venkateswara-temple-at-tirumala-by-going-on-foot-via-al

ఇక టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందించి సత్కరించారు. ఆలయ పరిసరాల్లో భక్తులు అన్నా లెజినోవాను చూసి అభివాదం చేయగా, ఆమె కూడా వారికి చిరునవ్వుతో స్పందించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స జరిగింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యింది. అనంతరం కొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు.

పవన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి, రాజకీయ కార్యకలాపాల్లోకి తిరిగి రావాలని అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ఈ తరుణంలో అన్నా లెజినోవా కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడం రాజకీయంగా, ఆధ్యాత్మికంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+