రెస్టారెంట్ స్టైల్ "పనీర్ మష్రూమ్ బిర్యానీ" ఈజీగా ఎలా చేయాలంటే..?

సాధారణంగానే బిర్యానీ అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. చికెన్, మటన్ బిర్యానీలతో పాటు ఇప్పుడు వెజిటేరియన్ బిర్యానీలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా పనీర్, మష్రూమ్ కాంబినేషన్‌తో చేసే దమ్ బిర్యానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మసాలాల సువాసనలు, మెత్తని పనీర్, జ్యూసీ మష్రూమ్స్.. ఉడికిన బాస్మతి రైస్ కలిసి ఈ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్‌లో మార్చేస్తాయి.

కాగా ప్రోటీన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండే పనీర్.. మాంసాహారం తీసుకోని వారికి అద్భుతమైన శక్తిని ఇచ్చే ఆహారం. అంతే కాకుండా పుట్టగొడుగుల్లో ఉండే బీటా గ్లూకాన్లు హృదయ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి. కొన్ని రకాల మష్రూమ్‌లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సహజ సమ్మేళనాలను కలిగి ఉండటం విశేషం. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహ నియంత్రణలో కూడా సహాయపడతాయి. ఇంట్లోనే ఈజీగా తక్కువ సమయంలో Paneer Mushroom Biryani ఎలా తయారు చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

paneer-mushroom-biryani-making-recipe-in-telugu-with-easy-steps-and-tips-for-best-taste-also-serving

కావలసిన పదార్థాలు..

  • బాస్మతి బియ్యం - 2 కప్పులు (30 నిమిషాలు నానబెట్టినది)
  • పనీర్ - 200 గ్రాములు
  • మష్రూమ్స్ - 200 గ్రాములు
  • ఉల్లిపాయలు - 2
  • టమాటాలు - 2
  • పెరుగు - ½ కప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి - 3
  • కొత్తిమీర, పుదీనా - తగినంత
  • బిర్యానీ మసాలా - 1 స్పూన్
  • కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా - తగినంత
  • నూనె, నెయ్యి, ఉప్పు - అవసరమైనంత
  • బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క

తయారీ విధానం..

  • ముందుగా బాస్మతి బియ్యాన్ని బిర్యానీ దినుసులతో 70-80 శాతం వరకు ఉడికించి పక్కన పెట్టాలి.
  • ఒక గిన్నెలో నూనె, నెయ్యి వేడి చేసి కొంత ఉల్లిపాయను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసేయాలి.
  • అదే గిన్నెలో మిగిలిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు వేసి బాగా మగ్గించాలి.
  • ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసి కలపాలి.
  • తర్వాత మష్రూమ్స్, పనీర్ వేసి మెల్లగా కలిపి పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
  • ఇప్పుడు గ్రేవీపై ఉడికించిన బాస్మతి రైస్ పరచి, వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి చల్లాలి.
  • చివరగా గిన్నెకు మూతపెట్టి తక్కువ మంటపై 15-20 నిమిషాలు దమ్ చేయాలి.

సర్వింగ్..

వేడివేడిగా పనీర్ మష్రూమ్ దమ్ బిర్యానీని రాయితా, ఉల్లిపాయ సలాడ్ లేదా వెజ్ కుర్మాతో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+