ఏ క్షణమైనా మతం పేరుతో మృత్యువు ఒడిలోకి.. మసీదులో దాక్కున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్: Video

జమ్ముకశ్మీర్ కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌ ఎ తోయిబా ఉగ్రవాది ఉమర్ నిసార్ దార్ హతంకాగా, గాయపడిన మరో మోస్ట్ వాంటెడ్ కమాండర్ లతీఫ్ భట్ తప్పించుకున్నాడు. అయితే, పోలీసులు నిఘా పెంచి బుధవారం ఉదయం కుల్గామ్‌లోని ఓ ప్రాంతంలో అతడిని చుట్టుముట్టారు. ప్రస్తుతం లతీఫ్ భట్ ఓ మసీదులో తలదాచుకున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.

ఉగ్రవాది ప్రాణాలు కాపాడేందుకు భద్రతా బలగాలు మానవతా దృక్పథంతో ప్రయత్నించాయి. ఎన్‌కౌంటర్ స్థలంలోనే లతీఫ్ భట్‌తో వీడియో కాల్ ద్వారా అధికారులు మాట్లాడారు. 'మేము నీతోనే ఉన్నాం.. ప్రాణాలతో బయటపడవచ్చు, లొంగిపో' అని ఎస్‌హెచ్‌వో స్థాయి అధికారి ఎంతో విజ్ఞప్తి చేశారు. కానీ, ఉన్మాదంతో ఉన్న ఆ ఉగ్రవాది ఆ సువర్ణ అవకాశాన్ని తిరస్కరించాడు. 'నాకు అల్లాను కలవాలని ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు అల్లా తప్ప ఎవరూ లేరు' అంటూ లొంగిపోయేందుకు స్పష్టంగా నిరాకరించాడు.

Lashkar Commander Cornered In J amp amp K Mosque Police Urge Him To Surrender On Video Call But He Refuses
ఉగ్ర మూకల దొంగ దెబ్బ.. పోలీసుల తలలో బుల్లెట్లు..
ఉగ్ర మూకల దొంగ దెబ్బ.. పోలీసుల తలలో బుల్లెట్లు..

సీసీటీవీ ఫుటేజే కొంపముంచింది..

నవంబర్ 11న అఖ్రాన్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ చెక్‌పోస్ట్పై జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడి వెనుక లతీఫ్ భట్, ఉమర్ నిసార్ పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. ఘటనకు ముందు నవంబర్ 10న వీరుద్దరూ మీర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులు మంగళవారమే విడుదల చేశారు. ఉమర్ నిసార్ గత ఆరు నెలలుగా లతీఫ్‌కు ఆశ్రయం కల్పిస్తూ లాజిస్టిక్ సపోర్ట్ అందిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

కుల్గామ్ లో ఉగ్రదాడి.. ఒకరు మృతి, మరొకరికి సీరియస్
కుల్గామ్ లో ఉగ్రదాడి.. ఒకరు మృతి, మరొకరికి సీరియస్

వరుస హత్యలు, దాడుల మాస్టర్ మైండ్..

లతీఫ్ భట్ కేవలం చెక్‌పోస్ట్ దాడి మాత్రమే కాకుండా అనేక హేయమైన నేరాలకు పాల్పడ్డాడు. గూఢచారి నెట్‌వర్క్‌తో పాటు, జూలై 22న అనంతనాగ్‌లో పోలీసులపై జరిపిన దాడిలో ఒక కానిస్టేబుల్ మృతి చెందడానికి కూడా ఇతడే కారణం. అలాగే ఆగస్టు 1న కుల్గామ్‌లో ఇద్దరు వలస కార్మికుల హత్య వెనుక కూడా లతీఫ్ హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఉగ్రదాడి తర్వాత అప్రమత్తమైన బలగాలు కుల్గామ్‌లో భారీ కార్డన్ సర్చ్ నిర్వహించి, సుమారు 500 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఉగ్రవాదిని ఏరివేసేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్‌ను మరింత తీవ్రతరం చేశాయి. లతీఫ్ పై రూ.15 లక్షల హెడ్ రివార్డ్‌ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+