హైదరాబాద్-అమరావతి-చెన్నై బుల్లెట్ రైల్ కారిడార్ స్టేషన్లు ఖరారు: విజయవాడలో ఇలా..!!
ఏపీలో హైస్పీడ్ రైల్ కారిడార్ పై బిగ్ అప్డేట్. బుల్లెట్ రైల్ కారిడార్ ఏపీ మీదుగా వెళ్లే మార్గం ఫైనల్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ అంగీకారం తెలిపింది. రాజధాని అమరావతి రైల్వే స్టేషన్‌ను విజయవాడ నగరానికి అత్యంత చేరువలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. విజయవాడకు కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్టేషన్‌ను నిర్మించనున్నారు. అదే విధంగా ఈ కారిడార్ లో భాగంగా ఏపీలో స్టేషన్లు ఫైనల్ అయ్యాయి.
హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా ఏపీలో ప్రయాణించే మార్గం పైన స్పష్టత వచ్చింది. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలకు జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఎస్ ఆర్‌సీఎల్) అంగీకారం తెలిపింది. ఈ మేరకు విజయవాడకు కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్టేషన్‌ను నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ లభంచారు. విజయవాడ కు దూరంగా స్టేషన్ ఉంటే కలిగే ఇబ్బందులను వివరించింది. దీంతో.. విజయవాడకు 13 కిలోమీటర్ల దూరంలోనే అందుబాటులో ఉండేలా అమరావతి స్టేషన్‌ను ప్రతిపాదించారు. కాగా.. మొత్తం 760 కిలోమీటర్ల పొడవైన ఈ హైదరాబాద్-అమరావతి-చెన్నై కారిడార్.. ఆంధ్రప్రదేశ్‌లోని దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి మీదుగా చెన్నైకి చేరుకనే విధంగా ప్రణాళికలు ఖరారు చేసారు.

అలైన్‌మెంట్‌కు క్లియరెన్స్
దీంతో, ఏపీ పరిధిలోని 518 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌కు క్లియరెన్స్ లభించింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలైన్‌మెంట్ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్), డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని రైల్వే బోర్డును కోరారు. అదే విధంగా చెన్నై-బెంగళూరు కారిడార్ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడు లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం ప్రతిపాదించిన విమానాశ్రయ స్థలాన్ని మార్చడంతో అక్కడి హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్‌మెంట్‌పై గందరగోళం ఏర్పడింది. ఈ రెండు ప్రధాన కారిడార్ల పై స్పష్టత రాని కారణంగా తిరుపతి-చిత్తూరు లింక్ కారిడార్ ప్రాజెక్టు కూడా ప్రస్తుతానికి నిలిచిపోయింది. రెండు కారిడార్లను అనుసంధానించే ఈ లింక్ ప్రాజెక్టుకు కేంద్రం గతంలో సూత్రప్రాయంగా అంగీకారం లభించినా.. ప్రధాన కారిడార్ల అలైన్‌మెంట్లు ఖరారయ్యే వరకు వేచి చూడాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications
