El Nino: హైదరాబాద్‌లో దారుణంగా పడిపోతున్న నీటి నిల్వలు! డిసెంబర్ నుంచే పరిస్థితి చాలా ఘోరం..
దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ రాబోయే రోజుల్లో తాగునీటి ముసముసలాడబోతోంది. ముఖ్యంగా మన భాగ్యనగరం హైదరాబాద్‌పై ఎల్ నినో ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే డిసెంబర్ నాటికి నగరానికి తాగునీరు అందించే సింగూరు, మంజీర జలాశయాలు పూర్తిగా అడుగండే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతమే నగరంలో రోజువారీ నీటి కొరత దాదాపు 600 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డీ) మేర ఉండగా.. రానున్న కాలంలో ఈ లోటు ఏకంగా 1,000 ఎంఎల్‌డీలకు పైగా చేరే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే నీటి సంక్షోభం అత్యంత దారుణంగా ఉండేలా కనిపిస్తోంది.
డిమాండ్‌కు తగినట్లుగాందని నీటి సరఫరా..
నగరానికి రోజూ సుమారు 3,200 ఎంఎల్‌డీల నీటి అవసరం ఉండగా.. ప్రస్తుత సరఫరా మాత్రం కేవలం 2,600 ఎంఎల్‌డీల వరకే పరిమితమైంది. ఇందులో సింగూరు, మంజీర రిజర్వాయర్లు రెండూ కలిసి సుమారు 480 ఎమ్‌జీడీల నీటిని అందిస్తున్నాయి. ఇది మొత్తం నగర సరఫరాలో దాదాపు 20 శాతంగా ఉంది. కానీ ఈసార వర్షపాతం తగ్గడంతో ఈ జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. సింగూరులో కేవలం 7 శాతం, మంజీరలో 17 శాతం మాత్రమే నీరు మిగిలి ఉండగా.. ఉస్మాన్‌సాగర్‌లో 54 శాతం, నాగార్జునసాగర్‌లో 57 శాతం నిల్వలు ఉన్నాయి.

మిగతా నగరాలతో పోలిస్తే మన పరిస్థితి ఇబ్బందికరమే..
దేశ రాజధానిలో కూడా సుమారు 1,000 ఎంఎల్‌డీల నీటి కొరత ఉన్నప్పటికీ.. ఈ సీజన్‌లో అక్కడ 14 శాతం అదనపు వర్షపాతం నమోదు కావడంతో కొంత ఊరట లభించింది. అంతేకాకుండా ఢిల్లీ జలబోర్డు ముందస్తుగా మురుగునీటి పునర్వినియోగం, యమునా, గంగా పరీవాహక ప్రాంతాల్లో బోర్వెల్స్ ద్వారా అత్యవసర సరఫరా ఏర్పాట్లను ముందే సిద్ధం చేసుకుంది. ఇక ముంబైలో అయితే పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. అక్కడ ఉన్న ఏడు ప్రధాన జలాశయాలలో ప్రస్తుతం 80 శాతానికి పైగా నీటి నిల్వలు ఉన్నాయి. బెంగళూరులో కూడా కావేరి బేసిన్ జలాశయాలు సుమారు 50 శాతం నిల్వలతో సురక్షితంగా ఉన్నాయి. పైగా అక్కడ నీటిని నగరంలోని ఏ ప్రాంతానికైనా మళ్లించేందుకు ప్రత్యామ్నాయ పంపింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి.
ఐటీ కారిడార్‌కూ తప్పని నీటి తిప్పలు..
హైదరాబాద్‌లో మాత్రం రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది సాధారణం కంటే దాదాపు 240 మి.మీ. తక్కువ వర్షపాతం నమోదైంది. అంటే సుమారు 33 శాతం లోటు ఏర్పడింది. దీనివల్ల రాబోయే ఫిబ్రవరి నుంచి భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉందని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి మంజీర నీటిపై పూర్తిగా ఆధారపడి ఉన్న ఐటీ కారిడార్‌లోని దాదాపు 3.5 లక్షల మంది వినియోగదారులకు రాబోయే నెలలోనే నీటి కష్టాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభం రాబోయే ఏప్రిల్ వరకు కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.














Click it and Unblock the Notifications
