ఇంత తక్కువ పర్స్ బ్యాలెన్స్ తో ఎవర్ని కొందామని.. !!

ఐపీఎల్ వేలానికి సంబంధించి 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ నిర్ణయాలను పూర్తి చేసుకున్నాయి. ఇక వేలం బరిలోకి దిగడానికి సిద్ధం అయ్యాయి. ఈ ఆక్షన్ డిసెంబర్ 16వ తేదీన గోవాలో జరుగనుంది. వేలం సందర్భంగా నూతన ప్లేయర్లను తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ వద్ద ఎంత పర్స్ బ్యాలెన్స్ ఉందనేది ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. తోటి ఫ్రాంఛైజీతో పోటీ పడి స్టార్ ప్లేయర్లు, ఆల్ రౌండర్లను దక్కించుకోవడానికి పర్స్ బ్యాలెన్స్ అత్యవసరం.

వేలానికి వెళ్లే సమయంలో ప్రతి జట్టు వద్ద ఉన్న పర్స్ మనీ, ఖాళీగా ఉన్న స్లాట్లు ఆయా ఫ్రాంచైజీల వ్యూహాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేయడానికి లక్నో సూపర్ జెయింట్స్ అత్యధిక నిధులను నిలుపుకోగలిగింది. మిగిలిన తొమ్మిది ఫ్రాంఛైజీలతో పోల్చుకుంటే మొదటి స్థానంలో నిలిచింది. లోయెస్ట్ బడ్జెట్ ఉన్నది గుజరాత్ టైటాన్స్ వద్దే. ఈ కొద్దిపాటి మొత్తంతో ప్లేయర్లను మాత్రమే జట్టులోకి తీసుకోగలుగుతుందా టీమ్.

Lucknow Super Giants head into the IPL auction with biggest war chest at Rs 47 45 cr remaining Purse

ఎక్కువ బడ్జెట్ ఉన్న జట్లు విదేశీ స్టార్ ఆటగాళ్లతో పాటు మ్యాచ్ విన్నర్లపై ఖర్చు చేసే వెసలుబాటు కలుగుతుంది. పరిమితంగా బ్యాలెన్స్ ఉన్న జట్లు మాత్రం చాలా జాగ్రత్తగా, కూడికలు తీసివేతలతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తమకు కావలసిన అత్యుత్తమ ఆటగాళ్లను దక్కించుకోవడానికి నాలుగు జట్లే పోటీ పడే అవకాశం ఉంది.. ఈ రిమైనింగ్ పర్స్ ను చూస్తే.

తమిళనాడు మీదుగా శబరిమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక
తమిళనాడు మీదుగా శబరిమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక
  • రిటెన్షన్ ముగిసిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ 47.45 కోట్ల రూపాయలను మిగుల్చుకుంది. రిటెన్షన్ కోసం మొత్తం రూ. 72.55 కోట్లను ఖర్చు చేసిందీ జట్టు. 25 మంచి ప్లేయర్లు ఉండే స్క్వాడ్ లో ఇంకా ఏడు స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
  • కోల్ కత నైట్ రైడర్స్ వద్ద రూ. 41. 65 కోట్ల బ్యాలెన్స్ ఉంది. రిటెన్షన్ కోసం ఈ జట్టు 41.65 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా ఎనిమిది మంది ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంది.
  • రిటెన్షన్ కోసం రూ. 79.85 కోట్లు ఖర్చు పెట్టింది.. సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ జట్టు వద్ద ఇంకా రూ. 40.15 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. వేలంలో ఏడుమంది ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంటుంది.
  • రిటెన్షన్ కోసం ఖర్చు చేసిన రూ. 80.5 కోట్లు పోగా ఇంకా రూ. 39.50 కోట్ల మొత్తం మిగిలివుంది ఢిల్లీ కేపిటల్స్ వద్ద. ఈ మొత్తంతో తొమ్మిదిమంది ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంటుందా జట్టుకు.
  • ముంబై ఇండియన్స్ ఖాతాలో ఇంకా రూ. 32.6 కోట్లు మిగిలాయి. రిటెన్షన్ కోసం మొత్తం రూ. 32.60 కోట్లు ఖర్చు పెట్టిన ఈ అంబానీల జట్లు.. ఇంకా తొమ్మిదిమంది జట్టులోకి తీసుకోవాల్సి ఉంది.
  • చెన్నై సూపర్ కింగ్స్ 91.95 కోట్లను వ్యయం చేసింది రిటెన్షన్ కోసం. తన వద్ద మిగిలివున్న రూ. 28.05 కోట్లతో ఆరుమంది ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంది.
  • రాజస్థాన్ రాయల్స్ పరిస్థితీ ఇంతే. రిటెన్షన్ కోసం రూ. 92.95 కోట్లు కేటాయించగా.. ఇంకా రూ. 27.05 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో ఆరుమందిని తీసుకుంటుంది.
  • పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ కోసం 101.4 కోట్లను ఖర్చు పెట్టింది. ఇంకా రూ. 18.60 కోట్లు మిగిలివున్నాయి. ఇంకా ఆరు స్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఈ జట్టు వద్ద.
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద బ్యాలెన్స్ అమౌంట్ కూడా చాలా తక్కువే. రిటెన్షన్ లో 105.85 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రజెంట్ ఛాంపియన్ టీమ్ తన వద్ద మిగిలివున్న రూ. 14.15 కోట్లతో అయిదుమందిని తీసుకోవాల్సి ఉంది.
  • గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్ కోసం రూ. 111.25 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఈ జట్టు వద్ద మిగిలింది రూ. 8.75 కోట్లే. ఈ మొత్తంతో ముగ్గురిని తీసుకుంటే సరిపోతుంది. పర్స్ తక్కువగా ఉండటం వల్ల అన్ క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వొచ్చు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+