దూసుకొస్తున్న తీవ్ర తుఫాను, ఈ జిల్లాల్లో 48 గంటలు అప్రమత్తం - ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!

ఏపీలో తుఫాను దూసుకొస్తోంది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఆక్వాన్ తీవ్ర తుపానుగా బల పడింది. ప్రస్తుతానికి ఇది చెన్నైకి 580 కి.మీ, మచిలీపట్నానికి 610 కి.మీ, విశాఖపట్నానికి 610 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. ఎల్లుండి మధ్యా హ్నానికి నెల్లూరు- విశాఖ మధ్య తీవ్ర తుపాన్ గా తీరం దాటే అవకాశం ఉంది. దీంతో, ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఆక్వాన్ తుఫాను తీవ్ర రూపం దాల్చుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 100-110 కిమీ, గరిష్ఠంగా 120 వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో.. ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. తుఫాను పై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహిం చారు. ఎల్లుండి (నవంబర్ 20) మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉందని.. తీరం దాటే సమయంలో 100-120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో 48 గంటలపాటు రాష్ట్ర యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 NDRF, 11 SDRF, స్థానిక అగ్నిమాపక బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అనిత తెలిపారు.

 కూటమిలో జెడ్పీ ఛైర్మన్ సీట్ల పంపకాల్లో కీలక మార్పులు- ఎవరికి ఏ సీటు..!?
కూటమిలో జెడ్పీ ఛైర్మన్ సీట్ల పంపకాల్లో కీలక మార్పులు- ఎవరికి ఏ సీటు..!?
vangalapudi-anitha-reviews-severe-cyclone-aquan-preparedness-issues-key-directives-to-officials-for

ప్రభుత్వం కీలక సూచనలు

కాగా, ఉత్తరాంధ్రపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. వర్షాలు, ఈదురుగాలుల దృష్ట్యా రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారిక హెచ్చరికలను మాత్రమే నమ్మాలి, వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అధికార యంత్రాంగం సూచించిన వెంటనే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లా లని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం టోల్-ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 లను సంప్రదించాలని హోంమంత్రి తెలిపారు. విద్యుత్ అంతరాయం, చెట్లు కూలడం, నీటి నిల్వ, ఇతర సమస్యలపై మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+