మెక్సికోలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు ???
మెక్సికో తీరంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం ప్యూర్టో మడెరో సమీప సముద్ర ప్రాంతంలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. దీని లోతు కేవలం 10 కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో పొరుగున ఉన్న గ్వాటెమాల, ఎల్ సాల్వడార్ దేశాల్లోని పలు భవనాలు కూడా కంపించినట్లు చెబుతున్నారు. అయితే ఈ భూకంపం తీవ్రతతో ఏ మేరకు నష్టం వాటిల్లిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ క్రమంలోనే సముద్ర మట్టంలో ప్రమాదకర మార్పులు ఉండొచ్చని భావిస్తూ.. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని విపత్తు నిర్వహణ సంస్థలు కోరుతున్నాయి. ఈ సమయంలో బీచ్‌లు, నౌకాశ్రయాలు, తక్కువ ఎత్తున్న తీర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకూడదని కోరుతున్నారు. స్థానిక అధికారులు ఖాళీ చేయాలని సూచిస్తే ఆలస్యం చేయకుండా ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని వెల్లడించారు. భూకంపం తర్వాత కూడా ఆఫ్టర్‌షాక్‌లు వచ్చే అవకాశం ఉండటంతో దెబ్బతిన్న భవనాల్లోకి వెంటనే ప్రవేశించకపోవడం మంచిదని సూచిస్తున్నారు.

మరోవైపు ఇటీవల తీవ్రమైన భూకంపం దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో తీవ్ర విషాదాన్ని నింపింది. క్షణాల వ్యవధిలో ఒకదాని వెనుక ఒకటిగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత కలిగిన రెండు భారీ భూకంపాలు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల 1,450 మంది ప్రాణాలు కోల్పోగా.. 3,150 మందికి పైగా చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మెక్సికోలో భూకంపం ధాటికి కొన్ని భవనాలు ఊగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
🇲🇽🌍 BREAKING: Powerful 7.4 Magnitude Earthquake Strikes Off Mexico's Pacific Coast! 🚨⚠️
— Disaster Zone (@Disaster_X_) July 17, 2026
A magnitude 7.4 earthquake has struck off the southwestern coast of Mexico, approximately 71 km west-southwest of Puerto Madero, at a depth of 10 km, according to the USGS. pic.twitter.com/YjIJPY3Qs9


Click it and Unblock the Notifications