డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆపరేషన్ జరగగా.. డిశ్చార్జ్ కూడా అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు వరుసగా ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.

ఈ మేరకు పవన్ ను పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేన పార్టీ విప్ బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, అరవ శ్రీధర్‌తో పాటు పలువురు పార్టీ నేతలు, సినీ నిర్మాతలు, న్యాయవాదులు ఆయనను కలిసి ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా పాల్గొనాలని వారు ఆకాంక్షించారు.

raghurama-krishnam-raju-deputy-speaker-of-ap-assembly-visited-ap-deputy-cm-pawan-kalyan

కాగా పవన్ ను పరామర్శించిన నాయకులు ఆయనకు వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాజకీయ కార్యక్రమాలు, ప్రభుత్వ బాధ్యతలు, పార్టీ కార్యకలాపాల కంటే ప్రస్తుతం ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని వారు అభిప్రాయపడ్డారు. పవన్ పూర్తిగా కోలుకోవడానికి సుమారు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఫిజియోథెరపీ, వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలను సూచించారు.

అంతేకాకుండా ప్రస్తుతం కుడి భుజానికి చికిత్స పూర్తవుతున్న నేపథ్యంలో.. మరో రెండు నెలల తర్వాత ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు పవన్ ఆరోగ్యంపై జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు నిరంతరం ఆరా తీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా లక్షలాది మంది అభిమానులు ఆయన ఆరోగ్యంపై శుభాకాంక్షలు తెలియజేస్తూ సందేశాలు పోస్టు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q