సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా స్టార్ హీరో మాజీ భార్య..!
"నీట్" ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు జూన్ 28న నిరసనకు సైతం పిలుపునిచ్చింది. అందుకు గాను ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా మద్దతుగా నిరాహారదీక్ష చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి దేశవ్వ్యాప్తంగా ఎంతో మంది తమ సపోర్ట్ తెలియచేస్తున్నారు.
ఇప్పటికే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన మద్దతు ప్రకటించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ఉద్యమానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావ్ సపోర్ట్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. సర్కార్ వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ నిరసన చేస్తున్న వాళ్ళతో చర్చ లని మొదలెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్‌ను "ఐ సపోర్ట్ సోనమ్" ఫోటోగా మార్చుకున్నారు. సోనమ్ వాంగ్‌చుక్, అభిజీత్ దీప్కే, సీజేపీ.. సహా విద్యార్థుల పట్ల సంఘీభావం తెలుపుతున్న వారందరికీ తన మద్దతు ఉంటుదని ఆ పోస్టులో రాసుకొచ్చారు.

నిరాహార దీక్ష చేపట్టి 19 రోజులు అవుతున్నా ప్రభుత్వం అసలేమాత్రం రియాక్ట్ కాకపోవడం దారుణం అంటూ ఆమె వ్యాఖ్యానించారు. సర్కార్ సాధారణ ప్రజల మాట వినాలంటే ఇంకేం జరగాలని నిలదీశారు. ఇకనైనా వ్యాయం చేయాలని.. దీక్షకి ముగింపు పలకాలని కోరారు.
ఇక కిరణ్ రావు ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ మాజీ భార్య అని తెలిసిందే. 1973 నవంబరు 7న తెలంగాణాలోని వనపర్తి సంస్థానం రాజా జే.రామేశ్వర్ రావు కుమారుడికి జన్మించారు. ఆ తర్వాత కలకత్తాలో పెరిగిన ఆమె.. 1992లో ఆమె తల్లిదండ్రులతో పాటు ముంబైకు మకాం మార్చారు. 2023లో ఆమె దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ కి 97వ అకాడమీ అవార్డులకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కోసం ఇండియా తరపున ఎంట్రీని దక్కించుకోవడం విశేషం.












Click it and Unblock the Notifications