"శ్రీకృష్ణుడు ముస్లిం.. నమాజ్ చేసేవాడు": నాలుక కోస్తే రూ.10 లక్షల బహుమతి!

శ్రీకృష్ణుడు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తాడని అన్నందుకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ ముస్లిం మత గురువుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదిలా ఉండగా.. ఆ మత గురువు నాలుకను కోసేసిన వారికి రూ.10 లక్షల బహుమతిని ఓ హిందూ మత గురువు ప్రకటించడం గమనార్హం. జార్ఖండ్‌లో జరిగిన ఓ సభలో మౌలానా జర్జిస్ అన్సారీ ఓ వివాదాస్పద ప్రకటన చేశారు. సోషల్ మీడియా పేజీ ప్రకారం.. ఈ వీడియో పాతది కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీకృష్ణులు ముస్లిం అని, రోజుకు 5 సార్లు నమాజ్ చేసేవాడని అన్సారీ చేసిన కామెంట్ ఉద్రిక్తతలను రేకెత్తించింది. తన కామెంట్లకు మద్దతుగా ఆయన భగవద్గీతలోని ఆరో అధ్యాయం, పదో శ్లోకాన్ని ఉదహరించారు. ఆయన ఆ శ్లోకాన్ని పఠించి, హిందూ గ్రంథాలలో కూడా ముస్లిం బోధనలు ఉన్నాయని పేర్కొంటూ తనదైన వ్యాఖ్యానం ఇచ్చారు. ఆ శ్లోకంలో అలాంటి వాదన ఏదీ లేదని పండితులు, విమర్శకులు ఎత్తిచూపుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

FIR Against Maulana Jarjis Ansari Over Krishna Remarks Hindu Seer Offers 10 Lakh Bounty to Cut His Tongue

ఇంతటి అసంబద్ధమైన వాదన చేసి మత మనోభావాలను దెబ్బతీశారని హిందూ సంస్థలు అన్సారీపై విమర్శలు గుప్పించాయి. దీనిపై లక్నోలో ఫిర్యాదు నమోదు కాగా.. విద్వేషాలను రెచ్చగొట్టడం, మత మనోభావాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం లభించే ఆధారాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. హిందూ గ్రంథాలను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ మత గురువును హిందూ సంస్థలు తీవ్రంగా ఖండించాయి.

అన్సారీ నాలుక కోసిన వారికి రూ.10 లక్షల బహుమతి
అయోధ్యలో మీడియాతో మాట్లాడుతూ మహామండలేశ్వర్ విష్ణుదాస్.. అన్సారీ చేసిన కామెంట్లపై తీవ్రంగా విమర్శించారు. అన్సారీ శ్రీకృష్ణుడిని అవమానించారని.. అతనికి సంస్కృతంపై అవగాహన లేదని.. మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడానికి భగవద్గీతలోని శ్లోకాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఆయన అన్నారు. ఆ మౌలానా నాలుకను కోసివేసిన వారికి ఆయన రూ.10 లక్షల బహుమతిని ప్రకటించారు. ఈ బహుమతి ప్రకటన నేరపూరిత బెదిరింపు లేదా రెచ్చగొట్టడం కిందకు వస్తుందా అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్సారీ గతంలో కూడా వివాదాస్పద మత, సామాజిక ప్రకటనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+