Fact Check: ఆగస్టు 15 నుంచి ద్విచక్రవాహనాలకూ టోల్ ఫీజు ? కేంద్రం క్లారిటీ..!

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై వాహనాలకు ప్రయాణాన్ని మరింత సౌలభ్యంగా మార్చేందుకు కేంద్రం పలు సంస్కరణలు చేపడుతోంది. ఇప్పటికే టోల్ గేట్ల స్ధానంలో శాటిలైట్ ఆధారిత స్కాన్ వ్యవస్ధను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. టోల్ గేట్ తో సంబంధం లేకుండా దీన్ని అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. దీంతో పాటు ఆగస్టు 15 నుంచి కార్లు, బస్సులు, లారీలతో పాటు ద్విచక్ర వాహనాలకు సైతం టోల్ ఫీజు వసూలు చేసేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు ప్రచారం మొదలైంది.

దీంతో కేంద్రం తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్ధ ఎన్ హెచ్ ఏఐ కూడా క్లారిటీ ఇచ్చాయి. టూ వీలర్లకు సైతం టోల్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు వచ్చిన వార్తల్ని గడ్కరీతో పాటు రహదారుల సంస్ధ కూడా ఖండించాయి. ఓ వర్గం మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం ఫేక్ అని తేల్చేశారు. రవాణా సంస్కరణల్లో భాగంగా ఇలాంటి నిర్ణయమేదీ తాము తీసుకోలేదని స్పష్టం చేశారు.

union minister nitin Gadkari and NHAI clarified to two-wheelers toll fee from august 15

ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించడం గురించి కొన్ని మీడియా సంస్థలు తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని గడ్కరీ తెలిపారు. అలాంటి నిర్ణయం ఏదీ ప్రతిపాదించలేదన్నారు. ద్విచక్ర వాహనాలకు టోల్ మినహాయింపు పూర్తిగా కొనసాగుతుందన్నారు. సంచలనం సృష్టించడానికి సత్యాన్ని ధృవీకరించకుండా తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం ఆరోగ్యకరమైన జర్నలిజానికి సంకేతం కాదని, దీనిని ఖండిస్తున్నానట్లు గడ్కరీ తెలిపారు.

జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ NHAI కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే చేసింది. భారత ప్రభుత్వం ద్విచక్ర వాహనాలపై వినియోగదారు రుసుము విధించాలని యోచిస్తోందని కొన్ని మీడియా సంస్దలు కథనాలు ప్రచురించాయని, అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనాలకు టోల్ ఛార్జీలను ప్రవేశపెట్టే ప్రణాళికలు లేవని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+